హైదరాబాద్

ఆర్థిక సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఫలితంగా బల్దియా కార్యకలాపాలు దినదిన గండంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో ఎస్‌ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి ప్రాజెక్టులు చేపట్టడటంతో బల్దియా ఖజానా ఎప్పటికపుడు ఖాళీ అవుతోంది. ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్ విభాగాల నుంచి లక్ష్యానికి మించి కలెక్షన్ వస్తున్నా, పాతబకాయిల చెల్లింపుల కారణంగా ఎప్పటికపుడు ఖజానా ఖాళీ అవుతూనే ఉంది. బల్దియాకు ప్రధానంగా ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్ భవన నిర్మాణ అనుమతులతో పాటు అడ్వర్‌టైజ్‌మెంట్లు, ట్రేడ్ లైసెన్స్ వంటివి ప్రధాన ఆదాయ వనరులు. అయితే నిర్ణీత టార్గెట్ల ప్రకారం ప్రతి ఏటా ఆస్తిపన్నును వసూలు చేసుకుంటున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏటా జీతాలు, పెన్షన్ల చెల్లింపులు కూడా గగనంగా మారాయి. ఎలాంటి కొత్త అభివృద్ధి ప్రతిపాదనల్లేకుండా రొటీన్‌గా బల్దియా బండి ముందుకు సాగాలంటే నెలకు రూ. 150 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. ఏటా జీతాల కోసం రూ. 1260 కోట్లు జీతాలకే సరిపోతోంది. దీనికి రొటీన్ మెయిటనెన్స్ ఖర్చులుగా రూ. 540 కోట్లు, బాండ్ల వడ్డీ కోసం మరో రూ. 120 కోట్లతో కలిపి ఏటా బల్దియా మొత్తం రూ.1920 కోట్లను బల్దియా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయాల్సి ఉంది. కానీ డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్‌ఆర్‌డీపీ పనుల కోసం చెల్లించాల్సిన బిల్లులు ఇప్పటికే వేలా కోట్లలో మిగిలిపోయాయి. ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లను ఈ ఆర్థిక సంవత్సరం రూ.1800 కోట్ల కలెక్షన్ టార్గెట్‌గా పెట్టుకున్నా, లక్ష్యానికి తగిన విధంగా వసూలు చేసుకున్నా, మార్చి నెలాఖరుకల్లా మరో రూ. 120 కోట్ల వరకు లోటు ఏర్పడే అవకాశముంది. ఈ లోటును కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్ణయించనున్న ఆస్తిపన్ను వసూళ్లతో, ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తూ గడ్డుకాలాన్ని అధిగమించాలని అధికారులు భావిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి లక్ష్యానికి మించి రూ. 800 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా, అందులో సగం వరకు స్థల సేకరణకు ఖర్చయ్యే అవకాశాలుండటంతో వచ్చే ఆర్థికసంవత్సరం సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాల్లేకపోలేవు. తాజాగా రూపే టర్మ్‌లోన్ కింద రూ.2500 కోట్లు మంజూరైనా, మెయింటనెన్స్, ఇంజనీరింగ్ పనులతో పాటు ఎస్‌ఆర్‌డీపీ బిల్లులు సిద్దం చేసి, వాటిని సమర్పించి ఈ టర్మ్‌లోన్‌ను డ్రా చేసుకోవచ్చు. అధికారులు సమర్పించే బిల్లుల ప్రకారం డ్రా చేసుకునే టర్మ్‌లోన్ నిధుల ప్రకారం వడ్డీ బల్దియానే చెల్లించాల్సి ఉంది. ఈ లోన్‌ను నుంచి రూ.200 కోట్ల ను స్థల సేకరణకు నష్టపరిహారంగా చెల్లించేందుకు వరకు డ్రా చేసుకునేందుకు ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేశారు. ఈ సంవత్సరం వచ్చిన ఆదాయం మొత్తాన్ని పాత బకాయిలు, ఉద్యోగుల జీతాలకు చెల్లించినా, రానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా నెలకొననున్న సంక్షోభం నుంచి కార్పొరేషన్ ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి!