హైదరాబాద్

ఎయిర్‌పోర్ట్‌లో అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు ఎయిర్‌పోర్టు నిర్వాహక సంస్థ జీఎంఆర్ తెలిపింది. ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ఇంటర్నేషనల్ డిపార్చర్, పార్కింగ్, బస్టాండ్ ఏరియా, ఎయిర్‌పోర్ట్ అరీనా, నోవోటెల్ హోటల్, రోటరీ చౌరస్తా, హజ్ టెర్మినల్, ఏటీసీ టవర్స్ ఏరియాల్లో భద్రతను పెంచారు. ఎయిర్‌పోర్టు విస్తరణ జరుగుతున్న ప్రాంతంలోనూ భద్రత కట్టుదిట్టం చేసి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టులో గస్తీ ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిపోయే ప్రధాన రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలపై నిఘాను ఏర్పాటు చేశారు.