హైదరాబాద్

ఇంకెప్పుడు ఇస్తారో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వర్తించాలి, విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని ప్రకటనలు చేసే ఉన్నతాధికారులు సకాలంలో జీతాలిప్పించటంలో ఘోరంగా విఫలమవుతున్నారు. 2018 డిసెంబర్‌లో రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు, 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికల విధుల తాలూకు జీతాలు చెల్లించినా, ఎంపీ ఎన్నికల జీతాలు ఇంకా చెల్లించలేదని, ఈ క్రమంలో మళ్లీ ఎన్నికల విధులు నిర్వర్తించమంటున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 3997 పోలింగ్ కేంద్రాలుండగా, వీటిలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఓ ప్రెసైడింగ్, మరో అసిస్టెంటు ప్రెసైడింగ్ అధికారితో పాటు మరో నలుగురు సహాయక సిబ్బందిని నియమించారు. ఒక్కో బూత్‌కు సుమారు ఐదు నుంచి ఆరుగురు సిబ్బందిని నియమించారు. దీంతో పాటు నియోజజకవర్గాల వారీగా రిటర్నింగ్, అసిస్టెంటు రిటర్నింగ్ ఆఫీసర్లతో కలిపి మొత్తం వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించటంతో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం నియమించిన సిబ్బంది మొత్తంలో ఇరవై శాతం సిబ్బంది, అధికారులను రిజర్వులో పెట్టుకోవల్సి ఉంది.