హైదరాబాద్

వెంటనే బ్యాలెట్‌ను ప్రింట్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డబీర్‌పురా మున్సిపల్ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌ను వెంటనే ముద్రించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సోమవారం ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థుల ప ఏర్లు, గుర్తులను జాగ్రత్తగా ముద్రించాలని సూచింరు. ఈ వార్డు ఎన్నికలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులను పోలింగ్ విధుల నిర్వహణకు వినియోగించరాదని స్పష్టం చేశారు. తద్వారా పోస్టల్ బ్యాలెట్‌ను ముద్రించాల్సిన అవసరం ఉండదని ఆయన వివరించారు. డబీర్‌పురా ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఆయా మున్సిపాల్టీల్లో ఓటరుగా ఉంటే పోస్టల్ బ్యాలెట్‌ను ఇప్పించేందుకు సహకరించాలని తెలిపారు. పారదర్శకతకు డబీర్‌పురా వార్డులోని 18 ప్రాంతాల్లో ఉన్న 66 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఇతర సర్వీసు ప్రొవైడర్ల సేవలను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా వసతులు కల్పించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ వేగంగా నిర్వహించేందుకు గాను 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తిగా రికార్డు చేయనున్నట్లు వెల్లడించారు. మోలింగ్ కేంద్రాల వారిగా సెక్యూరిటీ ప్లాన్‌ను అమలు చేస్తామని అన్నారు. చెక్ లిస్టు ప్రకారం ఎన్నికల పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. డబీర్‌పురా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరును గుర్తిచేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో అదనంగా ఒక సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈ వార్డులో మొత్తం ఓటర్ల సంఖ్య 50వేల 15కు చేరిందని, 2019 అక్టోబర్ 5వ తేదీ నాటికి 49వేల 445 ఓటర్లుండగా, ఆ తర్వాత 689 మంది పెరిగారని, 119 మంది ఓటర్ల వివరాలను తొలగించినట్లు తెలిపారు. ఈ సమీక్షకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ మాట్లాడుతూ పోలింగ్‌పై ప్రెసైడింగ్, అసిస్టెంటు ప్రెసైడింగ్ అధికారుకు రెండో విడత శిక్షణను పూర్తి చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్(ఎన్నికలు) జయరాజ్ కెనడీ, ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్ పంకజ తదితరులు పాల్గొన్నారు.