హైదరాబాద్

ప్రజా సహకారంతో శాంతి భద్రతల పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని గోపాల్‌పురం సబ్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పీ.వెంకట రమణ విజ్ఞప్తి చేశారు.
డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలో నేరాలు తగ్గించడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించడం తమ కర్తవ్యమన్నారు. రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదతర ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లను పూర్తిగా అరికట్టామని, నిరంతరం పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి గొడవలు జరుగకుండా చూస్తున్నామన్నారు. స్థానికంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అయన సూచించారు. గోపాలపురం సబ్ డివిజన్ పరిధిలోని చిలకల్‌గూడ, లాలాపేట్, గోపాలపురం, తుకారంగేట్ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తూ అనుమానం కలిగిన వారిని అదుపులోకి తీసుకుని విచారించిన తరువాత వదిలిపెట్టడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్టేషన్‌లలో క్రమంగా క్రైమ్ రేట్‌ను తగ్గించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించిన్నట్లు ఏసీపీ తెలిపారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో కూడా పోలీసు గస్తిని ముమ్మరం చేశామన్నారు. రోడ్లపై మద్యం సేవించి ఇతరులకు ఆటంకం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆయా పోలీస్టేషన్‌ల పరిధిలోని పాత నేరస్తుల కదలికలపై దృష్టిని సారించిన పోలీసులు పాత నేరస్తుల నేరప్రవృత్తి మారకపోతే అలాంటి వారిపై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీల వద్ద పోలీసు పికెట్‌లను ఎర్పాటు చేసి మహిళలు, యవతులకు, పాఠశాల విద్యార్థిణిలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామన్నారు. నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు సంబంధించి బస్తీ వాసులతో సమీక్ష సమావేశాలు నిర్వహంచి వారిని చైతన్య వంతులను చేస్తామన్నారు.