హైదరాబాద్

సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: పిల్లలకు చిన్నతనం నుంచే సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. ఇటీవల మృతి చెందిన దిశ అశ్రు నివాళి సందర్భంగా ఆదరణ సేవా సమితి, నాగేశ్వర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ‘్భవి నుంచి దివికి..’ పేరిట సినీ సంగీత విభావరి గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని దిశ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. దిశ సంఘటనలో చట్టలు, పోలీస్ వ్యవస్థ వెంటనే అప్రమత్తమై దోహులను గుర్తించి తీర్పు ఇచ్చిన సంఘటన ఎంతో ఆనందం కలుగజేసిందని పేర్కొన్నారు. తెలంగాణలో చట్టలు ఎంతో ప్రతిష్టత్మంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని అన్నారు. ప్రముఖ గాయకుడు డా.నాగేశ్వర రావు నిర్వహణలో నర్మద, విజయలక్ష్మీ, అన్నపూర్ణ, వాణిమాల, చంద్రజ్యోతి, లక్ష్మీవాణీశ్వరి, గంటి శైలజ, లలిత, వాసురెడ్డి, ఉమాకాంత్, వెంకటేశ్వర రావు, సుబ్బిరెడ్డి, మారుతి రావు అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త శశిబాల, మల్కాజ్‌గిరి జడ్జ్ జస్టిస్ బూర్గుల మధుసూదన్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సాహితీవేత్త తెనే్నటి సుధాదేవి పాల్గొన్నారు.