హైదరాబాద్

శ్రమ్ యోగిమాన్-దాన్ పథకం అమలుకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కుటుంబాలకు లబ్దిచేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్-్ధన్ పథకం అమలుకు కమిటీని ఏర్పాటు చేసినట్టు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ హరీష్ తెలిపారు. జిల్లా స్థాయిలో లబ్దిదారులను ఈ కమిటీ గుర్తిస్తుందని చెప్పారు. శ్రమ్ యోగి మాన్ -దాన్ పథకంలో భాగంగా జిల్లాలో ఉన్న ఏడు లక్షల మందికి పైగా అసంఘటిత కార్మికులకు వృద్దాప్య ఫించన్‌ను వర్తింప చేసేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి ఇంప్లీమెంటేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెలకు రూ.15వేల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న గృహ నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, తోలు కార్మికులు, రిక్షా, చేనేత కార్మికులు ఆడియో విజువల్ కార్మికులకు వర్తిస్తుందని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్లు ఉండి ఈపీఎఫ్/ ఎన్‌పీ ఎస్/ ఈ ఎస్ ఐసీ వంటి వాటిలో సభ్యత్వం లేనివారు అర్హులని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారని, సభ్యులుగా జిల్లా లేబర్ కమిషనర్, సీఈఓ జిల్లాపరిషత్, జిల్లా పంచాయత్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కోఆపరేటివ్ సీఎస్‌సీ, భారత ప్రభుత్వంతో నియమించబడిన అధికారి, జిల్లా ఎల్‌ఐసీ అధికారి, వెనుకబడిన తరుగతుల, సమాచార పౌర సంబంధాల శాఖ, విద్యా, వ్యవసాయ, మత్స్య శాఖలకు చెందిన అధికారులు ఉంటారని తెలిపారు.