హైదరాబాద్

ఎస్‌ఆర్‌నగర్‌లో బహుళ అంతస్తుల కమ్యూనిటీ హాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో స్థానికుల సౌకర్యార్థం త్వరలోనే బహుళ అంతస్తు కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తామని, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంజీవరెడ్డినగర్ కమ్యూనిటీ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 1966-69లో నిర్మించిన ఎస్‌ఆర్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ కాలానుగుణంగా అభివృద్ధి చెందిందని వివరించారు. కాలనీవాసుల సౌకర్యార్థం 1970లో కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థలో ఉన్నందున, కొత్త భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాలనీవాసుల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్‌ను నిర్మించే బాధ్యత గృహా నిర్మాణ శాఖ తీసుకుంటుందని అన్నారు. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి, ఈ కమ్యూనిటీ హాల్‌ను ప్రజలకు అందుమాటులోకి తేనున్నట్లు తెలిపారు. రెండు సెల్లార్లు, ఫంక్షల్ హాల్‌తో కూడిన ఈ బహుళ అంతస్తు కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలన్నీ పూర్తయినట్లు వివరించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ సంజీవరెడ్డినగర్ కమ్యూనిటీ హాల్ దీనవస్థలో ఉందని, దాన్ని వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర గృహానిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్, స్థానిక కార్పొరేటర్ శేషుకుమారి పాల్గొన్నారు.