హైదరాబాద్

3న ‘డిసేబుల్డ్ అవర్నెస్ వాక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో నగరంలో వచ్చే నెల 3న నిర్వహించనున్న అవెర్నెస్ వాక్‌కు జీహెచ్‌ఎంసీ సహకరించాలని వేదిక బుధవారం కమిషనర్ లోకేశ్ కుమార్‌ను కలిసి వినతి సమర్పించింది. దివ్యాంగులకు ఉన్న ప్రత్యేక చట్టాలు, ఆ చట్టాల్లో ఉన్న వివిధ అంశాలు, సదుపాయలు, వాటి పొందే విధానం వంటి అంశాలపై దివ్యాంగుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ వాక్‌ను నిర్వహిస్తున్నట్లు ఆవెర్నెస్ వాక్ కోఆర్డినేటర్ కొల్లి నాగేశ్వర రావు, శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో డిసెంబర్ 3న ఉదయం ఏడు గంటలకు వాక్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మనస్సున్న మనుషుల్లారా మాతో కాసే కలిసి నడవండి అనే నినాదంతో ఈ వాక్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులకు ఉన్న చట్టాలు, విద్యా, శిక్షణ, వైద్యం, ఉద్యోగం, వివాహం తదితర విషయాలను తెలియపరుస్తూ వారి అవసరాలను తీర్చే మార్గాన్ని కూడా ఈ వాక్‌లో సూచించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ దివ్యాంగుల పట్ల పెరిగిపోయిన మూఢనమ్మకాలను, కట్టుకథలను, అవహేళనలను పూర్తిగా తొలగించి అందరితో పాటు జన జీవన స్రవంతిలో కొనసాగాలే సమాజాన్ని చైతన్యపర్చటం, మహిళలు సమాజంలో మూడు రకాల న్యూనత భావానికి గురువుతున్నారని వివరించారు. ప్రసవ దశ నుంచి శైశవదశ, బాల్యం మొదలకు అన్ని దశల్లో వైకల్యం అరికట్టడానికి తల్లిదండ్రులు, ప్రభుత్వం యంత్రాంగంతో స్వచ్ఛంద సంస్థలతో మేధావులందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిజేబుల్డ్ అవెర్నెస్ వాక్‌ను ఏడోసారి నిర్వహించనున్నట్లు వివరించారు.