హైదరాబాద్

సాహిత్య రంగంలో సోమసుందర్‌ది సుస్థిర స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: సాహిత్య రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి డా.ఆవంత్స సోమసుందర్ అని పలువురు వక్తలు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త ఆవంత్స సోమసుందర్ జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త డా.తెనే్నటి సుధాదేవి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని సోమసుందర్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. సాహిత్య రంగంలో అనేక ప్రక్రియాల్లో రచనలు చేసి ఉన్నత శిఖరలను అధిరోదించారని పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని వివరించారు. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించి సాహితీమూర్తి సోమసుందర్ అని కీర్తించారు. నృత్య దర్పణ్ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
‘బాలరత్న’ అవార్డులు ప్రదానం
కాచిగూడ, నవంబర్ 19: జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ‘బాలరత్న’ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమం కమలాకర లలిత కళాభారతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనా రెడ్డి పాల్గొని కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. కళాకారులకు బాలరత్న అవార్డులను ప్రదానం చేసి వారిని ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. సాహితీవేత్త ఆచార్య టీ.గౌరి శంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ కవి చిమ్మపూడి శ్రీరామమూర్తి, సినీ అర్టిస్ట్ లవకుశ నాగరాజు, రచయిత్రి శశిబాల, సాధన సాహితీ స్రవంతి అధ్యక్షుడు సాధన నరసింహా చార్య, సంస్థ అధ్యక్షురాలు లయినెస్ భారతీ కమలాకర్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, నవంబర్ 19: శారద మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజ్‌గిరి న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, రామకృష్ణా రెడ్డి, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించారు. ప్రముఖ గాయనీ శారద నిర్వహణలో సాయిపావని, నర్మద, రజని, గోవింద లక్ష్మీ, ఉషా, జ్యోత్న్స, రమాదేవి, అన్నపూర్ణ, నాగేశ్వర రావు, వెంకటేశ్వర రావు, కృష్ణమోహన్, సుబ్బిరెడ్డి, వీరేందర్, వీకే రాజు అలపించిన సినీ గీతాలు అలరించాయి.