హైదరాబాద్

రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖరీఫ్ కొనుగోలు వరి ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం బీఆర్‌కే భవన్ నుండి వరి ధాన్యం, పత్తి, కొనుగోలు పై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎస్పీలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. రైతులు నష్టపోకుండా చూడాలని చెప్పారు. అన్ని రాష్ట్రాల రైతులు వరి పంటను పండిస్తున్నారని అన్నారు. పోలీసు అధికారుల సమన్వయంతో చెక్ పోస్టును ఏర్పాటు చేయాలని చెప్పారు. కొనుగోలు సేకరణలో పకడ్బందీ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఐకేపీ పీఏసీఎస్ సెంటర్‌లు బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పారు. గ్రామాల్లో రైతుకు ఎన్ని ఎకరాల వరి పంట ఉందని, కొనుగోలు సెంటర్‌కు తీసుకువచ్చిన పంట రైతుదేనా కాదా క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. కొంత మంది రైతుల వివరాలు రికార్డుల్లో లేకపోయినా పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తారని వారు సాధారణ రైతు అవునా కాదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. వారి వివరాలను వ్యవసాయ అధికారి ఏఈఓల అనుమతితో తీసుకోవాలని చెప్పారు. రైతుల వివరాలను రాండంగా చెక్ చేసుకోవాలని అన్నారు. వివరాలను గ్రామాల వారీగా, మండలాల వారీగా తయారు చేసుకోవాలని తెలిపారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వరిని ధాన్యాన్ని నియంత్రించేందుకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌లను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి చాయాదేవి, సివిల్ సప్లై అధికారి రాథోడ్, వ్యవసాయధికారి గీతారెడ్డి పాల్గొన్నారు.