హైదరాబాద్

అందరి చేయూతతో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : రంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి సమిష్టిగా ముందుకు సాగుదామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రాములు, కలెక్టర్ హరీష్, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. జిల్లాలోని సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందని చెబుతున్న రైతుబీమా సక్రమంగా సాగడం లేదని అన్నారు. ఇప్పటికీ పట్టాలు అందక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుతున్నారని అన్నారు. జిల్లాలో సుమారు మూడు లక్షల 20వేల మంది రైతులు ఉండగా, లక్షా,50వేల మంది రైతులకు మాత్రమే భీమా పరిధిలో ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల కుటుంబాలకు రైతుబీమా ఎంతో కీలకమైనదని అలాంటి పథకంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు లబ్ధిచేకూర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని దాపరికం లేకుండా అధికారులు రైతులకు ఇన్సురెన్స్ చెల్లించి ఆదుకోవాలని సూచించారు.
గతంలో ఆమన్‌గల్‌లో ఏడీ కార్యాలయం ఉండేదని, దానిని తీసి షాద్‌నగర్‌లో ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేలు సైతం అమన్‌గల్‌లో ఏడీ కార్యాలయం తప్పకుండా ఏర్పాటు చేయాలని కోరడంతో మంత్రి సబిత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. మందుల కొరత వెంటాడుతుందని, వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డెంగ్యూ వ్యాధితో మృత్యువాత పడుతున్నారని, పాము కాటు వంటివి జరిగితే సరైన మందులు లేని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో మార్చురీ గది సరిగా లేదని, పాఠశాలకు అనుకొని ఉందని తెలిపారు. మంత్రి సబిత జోక్యం చేసుకొని మార్చురీ గదిని ఆధునికరిస్తామని అన్నారు. జిల్లాలో మందుల కొరత ఎక్కడా లేదని, ఇటీవలే ఆసుపత్రులను సందర్శించినట్టు ఇంచార్జ్ కలెక్టర్ హరీష్ తెలిపారు. గ్రామాల్లో నివసించే ప్రజలకు మంచినీటిని అందించే నిమిత్తం ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరధ అద్బుతమైన పథకమని అయితే భగీరధ పైప్‌లైన్ల కోసం తవ్విన గుంతలు సక్రమంగా పూడ్చక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
సమన్వయంతో పనులు సాగించాలని మంత్రి సబిత సూచించారు. పాఠశాలలకు మిషన్ భగీరధ ద్వారా నల్ల కనెక్షన్స్‌ను ఇప్పటికే ఇస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఎక్కడైన లేనివి ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే కనెక్షన్స్ ఇస్తామని తెలిపారు. జిల్లాలో అక్రమ లే అవుట్లపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బడిముబ్బడిగా పంట పొలాలను లే అవుట్లు మార్చి విక్రయిస్తున్నారని మండిపడ్డారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వాపోయారు. గ్రామ పంచాయితీ నిరాకరించిన వాటిని హెచ్‌ఎండీఏ, డీటీడీసీ పేర్లతో అనుమతులు పొందినట్టు చెబుతూ విక్రయాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. లే- అవుట్లు చేసే సమయంలో ప్రభుత్వ భూములు ఎదేచ్చగా కబ్జాకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి అక్రమ లే అవుట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధంగా విక్రయిస్తున్న స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకూడా ఆదేశాలు జారీ చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ హరీష్‌కు సూచించారు. విద్య శాఖపై జరిగిన చర్చలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల సమస్యలను సభ్యులు ఎకరువు పెట్టగా స్పందించిన మంత్రి ప్రత్యేక కార్యచరణతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులతో పలు మార్లు చర్చించినట్టు చెప్పారు. ప్రతి పాఠశాలకు మంచినీటి సదుపాయం, మరగుదొడ్లు, కిచెన్‌ను నిర్మించడంతో పాటు అవసరాన్ని బట్టీ అదనపు తరగతి గదులను నిర్మిస్తామని చెప్పారు. మొత్తంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. సభ ప్రారంభంలో పెట్రోల్ దాడిలో మృతి చెందిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి సంతాపం తెలియజేసి, రెండు నిమిషాలు వౌనం పాటించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, యాదయ్య, జైపాల్ యాదవ్‌లతో సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఉప్పునీళ్లతో విద్యార్థులకు వంటలు

* ఇంటి నుంచే తాగునీరు
తెచ్చుకుంటున్న విద్యార్థులు
కొత్తూరు రూరల్, నవంబర్ 8: కేజీబీవీ పాఠశాలలో రూ.లక్షలు ఖర్చు చేసి అధికారులు శుద్ధజల యంత్రాన్ని కొనుగోలు చేశారు. దీనిని బిగించకపోవడంతో వినియోగంలోకి రాలేదు. సుమారు 200మంది ఉన్న ఈ విద్యాలయంలో రోజుకు సగటున 1000 లీటర్ల నీరు అవసరం అవుతోంది. 20 లీటర్ల శుద్ధజలానికి బయట రూ.15 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు సుమారుగా రూ.1000 ఖర్చు చేయావల్సి వస్తోంది. యాంత్రాన్ని ఉపయోగించకపోవడంతో తుప్పుపడుతోంది. ఒక్క కేజీబీవీ విద్యాలయమే కాదు మండలంలోని అన్ని విద్యాలయాల్లో పరిస్థితి ఇలాగే ఉంది.శుద్ధనీరు లేకపోవడంతో విద్యార్థుల గొంతులు ఎండుతున్నాయి. అధికారులకు ఇది చిన్న సమస్యగా అనిపించినా నీరు తక్కువగా తీసుకోవడంతో విద్యార్థులు భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. సరైన ఖనిజ లవణాలు శరీరానికి అందక చిన్నారుల్లో శారీరక ఎదుగుదల లేకపోవడం, ఎములకల్లో ధృడత్వం లేకపోవటం వంటి దుష్పరిణామాల సంభవిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. మండలంలో 24 ప్రాథమిక, నాలుగు ప్రాథమికోన్నత, ఐదు జిల్లా పరిషత్, ఒక కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. మద్యాహ్న భోజనానికి ఏజెన్సీ నిర్వాహకులు ఎక్కువగా లభించే బోరు నీటినే వాడుతున్నారు. పాత్రలు కడిగేందుకు మొదలు వంటలు చేసే వరకు ఆ నీరే దిక్కవుతోంది. కొన్ని పాఠశాలలో మాత్రమే శుద్ధజలం వినియోగిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో రోజుకు సుమారు తాగడానికి ఇతర అవసరాలుకు 100 లీటర్ల మంచినీరు అవసరమవుతోంది. ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి అందించే నిధులు నీటికే ఖర్చు అవుతున్నాయని అంటున్నారు. పలు పాఠశాలల్లో దాతలు అందించిన శుద్ధనీటి యంత్ర పరికరాలు నిర్వహణ లేకపోవడంతో మూలన పడ్డాయి.