హైదరాబాద్

ఇక్కట్లకు 20 రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపుడూ బిజీగా ఉండే మహానగరవాసులు ఒక చోట నుంచి మరోచోటకు ప్రయాణించేందుకు ఇక్కట్లు పడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటు డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరింది. ప్రజల ప్రయాణపు కష్టాలు, ప్రైవేట్ వాహనాలు, ఆటోవాలాల దోపిడీ, కార్మికుల నిరసనలు, సమ్మెకు సంఘీభావంగా విపక్షాలకు చెందిన నేతల ఆందోళనలు, అరెస్టులకు ఇరవై రోజులు గడుస్తున్నాయి. విద్యా, వృత్తి, ఉద్యోగం, ఉపాధి తదితర పనులపై రాకపోకలు సాగించే మహానగర వాసులు ప్రయాణ ఇక్కట్లు పడుతూ ఇరవై రోజులు గడిచినా, ఆర్టీసి కార్మికులు పట్టువీడటం లేదు, సర్కార్ కూడా మెట్టుదిగటం లేదు. ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటన క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం ఫలించటం లేదు. సమ్మెతో ఈసారి దసరా సెలవులను పొడిగించినా, విద్యార్థులకు ఇంకా ప్రయాణం కష్టాలు తప్పటం లేదు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించి అడపాదడపా బస్సులను నడుపుతున్నా, అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చార్జీలు తీసుకున్న తర్వాత తాత్కాలిక కండక్టర్లు టికెట్లు ఇవ్వకపోవటం, డ్రైవర్లు స్టాపుల్లో బస్సులను సక్రమంగా నిలపకపోవటంతో ప్రయాణికులకు, తాత్కాలిక సిబ్బందికి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. సమ్మె కొత్తలో నగరవాసులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రైవేట్ వాహనాలను, ఆటోవాలాలను ఆశ్రయించగా, రోజురోజుకీ సమ్మె వరమించే అవకాశాల్లేకపోగా, ఉద్ధృతం కావటంతో నగరంలో సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కాయి. ఫలితంగా ఆర్టీసీ బస్సులు అంతంతమాత్రంగా రాకపోకలు సాగిస్తున్నా, సిటీ రోడ్లపై ట్రాఫిక్ సమస్య తప్పటం లేదు. దీనికి తోడు నగరంలో రోజూ వర్షం కురవటంతో వాహనదారుల ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. నాగోల్ నుంచి అమీర్‌పేట మీదుగా హైటెక్‌సిటీ వరకు, ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట మీదుగా మియాపూర్ వరకు అందుబాటులో ఉన్న మెట్రోరైలుకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. అదనంగా రైళ్లు నడుపుతున్నా, రైలులో కనీసం నిల్చుండి ప్రయాణించేందుకు వీల్లేకుండా ప్రయాణికుల రద్దీ ఉంటుంది. కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని చివరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో సర్కారు కమిటీ వేసినా డిమాండ్లపై ప్రారంభమైన చర్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.
పరిగి: ఆర్టీసీ కార్మికుల నిరవదిక సమ్మె పరిగిలో 19 రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం ఆర్టీసీ ఉద్యోగులు శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ర్యాలీగా బయలిదేరి బస్టాండ్ వచ్చారు. సీపీఐ, సీపీఎం, ఏఐఎస్‌ఎఫ్, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆర్టీసీ ఉధ్యోగులు అంజనేయులు, శేఖర్, రాజు, వెంకట్, నరేష్, నరహరి, లక్ష్మీ, అలవేలు, వాణి, వెంకట్ పాల్గొన్నారు.
తాండూరు: ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత నెలకొంది. డిపోలోకి కార్మికులు, ఆందోళన మద్దతుదారులు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులను అడ్డుకోవడం సమంజసం కాదని బీజేపీ నేత పటేల్ రవిశంకర్ వాదనకు దిగారు. ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఉంటుందని కార్మికులకు భరోసా ఇచ్చారు.