హైదరాబాద్

డిసెంబర్‌లో జేబీఎస్ టూ సీబీఎస్ మధ్య మెట్రో పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మూడు కారిడార్లుగా ప్రతిపాదించిన మెట్రోరైలు ఇప్పటికే రెండు కారిడార్లు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాగా, సికిందరాబాద్ జేబీఎస్ నుంచి గౌలీగూడ సీబీఎస్ వరకు సిద్ధం చేసిన కారిడార్‌పై మెట్రోరైలు వచ్చే డిసెంబర్ మాసంలో పరుగులు తీసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కారిడార్‌పై సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కారిడార్ కూడా అందుబాటులోకి వస్తే నగరవాసులకు మొదటి దశ మెట్రో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టవుతోంది.
పంజాగుట్ట పీఎస్‌ను సందర్శించిన
బెటాలియన్ల కమాండెంట్లు
ఖైరతాబాద్, అక్టోబర్ 23: దేశంలోనే రెండవ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు పొందిన పంజాగుట్ట పీఎస్‌ను బుధవారం రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లకు చెందిన కమాండెంట్లు సందర్శించారు. అడ్మిన్ ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ అధునిక విధానాలతో నేరాలను నియంత్రిస్తున్న విధానాలను, ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు.
ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ రమేష్ (యూసఫ్‌గూడ), 4వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ వెంకటయ్య (వరంగల్), 5వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ చటర్జీ(వరంగల్), పదవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ జమీల్ పాషా(బాచుపల్లి)తో పాటు ఇతర సిబ్బంది సందర్శనకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సివిల్ పోలీస్ శాఖలో వచ్చిన మార్పులు, పోలీస్‌స్టేషన్‌లో అమలు చేస్తున్న 5ఎస్ విధానం, సీసీ కెమెరాల ఏర్పాటు, పాత నేరస్తులపై నిత్యం వంటి వాటితో నేరాలను నియంత్రించగలుగుతున్నట్టు చెప్పారు.