హైదరాబాద్

పాత సామానులు సేకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాత సామానులు కొంటాం..అంటూ అరుస్తూ తిరిగే వారు అపుడెపుడో నగర వీధుల్లో కన్పించేవారు. కాలక్రమేణా పాత వస్తువులు కొనుగోలు చేసే వారు కనుమరుగయ్యారు. ఇపుడు ఆ బాధ్యతను జీహెచ్‌ఎంసీ నిర్వర్తించాలనుకుంటోంది. నగరంలో దోమల నివారణ, డెంగ్యూ వ్యాధి ప్రబలటంపై హైకోర్టు పలు సూచనలు చేయడంతో దోమల నివారణలో భాగంగా నగరంలోని అన్ని ఇళ్లలో వృథాగా పడి ఉన్న పాత సమానులను సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఈ ప్రక్రియను పదిరోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌గా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేసుకుంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ఇళ్లలో వృథాగా పడి ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇతర నిరుపయోగ వస్తువులను సేకరించాలని నిర్ణయించారు. ఈ రకంగా నిరుపయోగమైన వస్తువులను నగరంలోని రోడ్లకిరువైపులా, నాలాల్లో వేయటంతో నాలాలు జాం అయి, మురుగు నీరు బయటకు ప్రవహిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ ప్రజలు వాటిని నాలాల్లో వేయకముందే సేకరించాలని నిర్ణయించింది. పదిరోజుల స్పెషల్ డ్రైవ్‌పై కాలనీ సంక్షేమ సంఘాలు, ఎన్‌జీఓలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ బావిస్తోంది. ఇంట్లో వృథాగా, నిరుపయోగంగా పడి ఉన్న వస్తువులను జీహెచ్‌ఎంసీకి అందజేయాలని మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను కోరాలని ఈ సమావేశంలో సూచించనున్నారు. ఈ రకంగా సేకరించిన వస్తువులను డివిజన్‌కు ఒక స్థలాన్ని ఎంపిక చేసి, ప్రజలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇళ్ల నుంచి సేకరించిన వస్తువులను ఆ స్థలంలో తెచ్చి వేయవచ్చునని సూచించేలా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.