హైదరాబాద్

ప్రాచీన కళలకు ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రాచీన కళలను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరికథా మహోత్సవం సందర్భంగా ప్రముఖ భాగవత కళాకారిణి సుశీలాదేవిచే ‘పద్మావతి శ్రీనివాస కళ్యాణం’ హరికథా కాలక్షేపం కార్యక్రమం బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేణుగోపాల చారి పాల్గొని కళాకారులను అభినందించారు. శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో సకల కళలను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతరించిపొతున్న కళలను వెలికితీసి కళలకు కాపాడుతుందని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో అభినందన భవాని, సీనియర్ పాత్రికేయురాలు దేవసేన పాల్గొన్నారు.
అలరించిన ‘ఆపాత మధుర గీతాలు’
కాచిగూడ, అక్టోబర్ 23: ప్రముఖ సినీ రచయిత అనిసెట్టి సుబ్బారావు జయంతి సందర్భంగా శ్రీత్యాగరాయ గానసభ, బృందావనం సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆపాత మధుర’ సినీ సంగీత విభావరి బుధవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి సినీ విజ్ఞాన విశారద ఎస్‌వీ రామారావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ, బృందావనం కార్యదర్శి వై.సుబ్రహ్మణ్యం పాల్గొని అనిసెట్టి సుబ్బారావు చిత్ర పటానికి నివాళి అర్పించి అనిసెట్టి సుబ్బారావు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు.
బాలు పాటల స్వరార్చన
కాచిగూడ, అక్టోబర్ 23: అలనాటి మధుర గీతాలు మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగజేస్తాయని ప్రముఖ కవి రసమయి అధినేత డా.ఎంకే రాము అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ, వౌళి మ్యూజికల్ సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలు పాటల స్వరార్చన’ కార్యక్రమం బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాము పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. బాల సుబ్రహ్మణ్యం వేల సినిమా పాటలను అలపించి తనకంటూ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారని కొనియాడారు. గాయనీ, గాయకులు వౌళి, ఉమారాజు, వాసవి, అనుపమ, ఫణీ, కామేష్, రమణ అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, అకాడమీ అధ్యక్షుడు నాగరాజు, సతీష్ పాల్గొన్నారు.