హైదరాబాద్

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హెచ్చరించారు. ఇప్పటికే మంగల్‌హాట్‌లో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆర్‌డీఓ శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. శివలాల్‌నగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించేందుకు వీలుగా ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తుందని అన్నారు. కొత్తగా నిర్మితమవుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు ముందు వైపు షాపులు నిర్మిస్తే పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలు ఉంటుందని స్థానిక కార్పొరేటర్ సూచించగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. మంగల్‌హాట్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, ఫలితంగా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే బాగు చేయించాలని అధికారులను ఆదేశించారు.
మహారాజ్‌గంజ్ యూహెచ్‌సీ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేనందున పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు వివరించగా, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
జ్ఞాన్‌బాగ్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రోడ్లు తదితర సమస్యలతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి దృష్టికి రావటంతో త్వరితగతిన డ్రైనేజీ పనులు చేపట్టి, ఆ తర్వాత రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. గోషామహల్ డివిజన్ జుగూర్‌బస్తీ ప్రాంతంలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టి, సకాలంలో పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే టీ.రాజాసింగ్, కార్పొరేటర్లు ముఖేశ్, పరమేశ్వరి ఉన్నారు.