హైదరాబాద్

ప్రయాణం పరేషానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే నగరంలో ప్రతిరోజు లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసి సమ్మె చేపట్టి 18 రోజులుగా కొనసాగుతున్నందున కారణంగా నగరంలో ప్రయాణం ప్రత్యక్ష నరకంగా మారింది. ప్రతిరోజు విద్యా, ఉపాధి, ఉద్యోగం ఇతర పనుల మీద బయటకొచ్చే నగర జీవి ఇంటి నుంచి బయటకొస్తే ఎన్ని కష్టాలో. ఒకవైపు వరుసగా కురుస్తున్న వర్షపు జల్లులు, మరోవైపు పూర్తిగా గుంతలమయమైన రోడ్లు. ఇక వర్షం కురుస్తున్నపుడు ద్విచక్ర వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణణాతీతం. ఆర్టీసి బస్సులు అందుబాటులో లేకపోవటంతో ప్రతిరోజు విధులకు హాజరయ్యే వారికి ప్రయాణం పెద్ద పరేషానీగా మారింది. రెండు కారిడార్లలో అందుబాటులో ఉన్న మెట్రోరైలు ప్రయాణికులతో కిక్కిరిసి, రాకపోకలు కొనసాగిస్తోంది. కనీసం పర్సనల్ బైక్ తీసుకుని పనుల మీద బయటకెళ్దామంటే రోడ్లన్నీ గుంతలమయంగా తయారయ్యాయి. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను పెట్టి ఆర్టీసి ప్రత్యామ్నాయంగా అడపాదడపా బస్సులు నడుపుతున్నా, అవి ప్రయాణికుల అవసరాలను తీర్చటం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు వాహానాలను ప్రయాణికుల అవసరాలను అసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. పరిమితికి మించి ప్రయాణికులతో కన్పిస్తున్న ఆర్టీసి బస్సుల్లో ఎక్కినా, తీసుకున్న ఛార్జీలకు టికెట్ ఇవ్వకపోవటం తలభారమైపోతోందని ప్రయాణికులు వాపోతున్నారు. పైగా తాత్కాలిక డ్రైవర్లు నడిపే బస్సు ఎంత వరకు భద్రత అన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. మామూలు రోజుల్లో మెహిదీపట్నం నుంచి సికిందరాబాద్ స్టేషన్ వరకు రూ. 15 నుంచి రూ.20 వరకు ఖర్చవుతుండగా, ఇపుడు ఛార్జీలు రెండింతలు ఖర్చవుతున్నందున ప్రయాణం అదనపు ఆర్థిక భారంగా మారిందని ప్రయాణికులంటున్నారు. ఇక సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగే ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతం. ఆర్టీసి బస్సులు అందుబాటులో లేకపోవటంతో ఉతాము విధులకు హాజరు కావటం గగనంగా మారిందని కొందరు ప్రైవేటు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతిరోజు ప్రైవేటు ఆఫీసులు, షాపులకు ఆలస్యంగా విధులకు హాజరుకావటం పట్ల యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించే పరిస్థితులు తలెత్తినట్లు పలువురు ప్రైవేటు ఉద్యోగులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, ఇక సర్కారు ఆఫీసుల్లో ఆర్టీసి సమ్మె కారణంగా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏ ఉద్యోగి, అధికారి ఎపుడు విధులకు వస్తారు? ఎంత సేపు ఉంటారో కూడా తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.