హైదరాబాద్

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సీఎం బేషరతుగా నెరవేర్చాలని నగర తెలుగుదేశం పార్టీ నేతలు పీ.సాయిబాబా, నల్లెల్ల కిషోర్, ముప్పిడి మధుకర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు జేబీఎస్ వద్ద చేపట్టిన వంటావార్పు కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ 18 రోజులుగా ఆర్టీసి కార్మికులు రోడ్డెక్కి రకరకాల ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా, ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియమకాలు అని చెబుతూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. కొత్త నియామకాలు చేపట్టడం దేవుడెరుగు కానీ, ఉన్న నియామకాలను కూడా తొలగించటం శోచనీయం అన్నారు. అతి పెద్ద రవాణా వ్యవస్థగా పేరుగాంచిన ఆర్టీసీలో ఏకంగా 48వేల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొంటే, పేదలు, సామాన్యుల కష్టాలను అర్థం చేసుకోలేని దౌర్భగ్య స్థితిలో సీఎం ఉండటం ఆయన నియంతృత్వ ధోరణీకి నిదర్శనమని పేర్కొన్నారు. కనీసం కోర్టు ఆదేశాలనైనా గౌరవించి కార్మికుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆర్టీసీ సమ్మె రూపంలో ఉన్న ఆందోళనలు మున్ముందు రాష్టవ్య్రాప్తంగా వ్యాపిస్తే, అది సీఎం పతనానికి దారి తీస్తుందని అన్నారు. కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థల ఆదేశాలను కాలరాసి, ఏ మాత్రం విలువ ఇవ్వకుండా, వాటిని పట్టించుకోకుండా, తప్పుడు పనులను చేసుకోవటానికి వాడుకుంటున్న నియంతృత్వ సీఎం కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బాల్‌రాజ్ గౌడ్, శ్రీపతి సతీష్, రవీంద్రా చారి, రాజా చౌదరి, ముప్పిడి మధుకర్, అన్వర్ హుస్సేన్, కరీమ్, బాలస్వామి, బాబు, ఎస్. ప్రకాశ్, కరణం గోపి, రామారావు, ప్రసాద్, గోల్కొండ శ్రీను, మహిళా నేతలు అన్నపూర్ణ, విజయశ్రీ, సుజాత ఉన్నారు.