హైదరాబాద్

ఓటరు వెరిఫికేషన్ గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరానికి ఎలాంటి తప్పిదాల్లేని ఓటరు జాబితాను తయారు చేసేందుకు జీహెచ్‌ఎంసీ మరో ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఓటరు జాబితా సవరణ కార్యక్రమాల్ని చేపట్టినా, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది చిత్తశుద్ధి లోపం కారణంగా ఆశించిన ఫలితం దక్కలేదు. పైగా కొందరు ఓటర్ల ఓట్లు గల్లంతైనట్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే! ఇటీవలే మరోసారి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ ఈ సారి మళ్లీ గడువును పెంచాల్సి వచ్చింది. వచ్చే నెల 18వ తేదీ వరకు ఓటరు వెరిఫికేషన్ గడువును పెంచింది. ఈ సమయంలో ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు క్షేత్ర స్థాయిలో ఓటరు వివరాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఓటర్లు కూడా తమ ఓటు తాలుకూ వివరాలు సక్రమంగా ఉన్నాయా?లేదా? అన్న విషయాన్ని సరిచూసుకుని తమకు సహకరించాలని ఎన్నికల విభాగం అధికారుల కోరుతున్నారు. వచ్చే నెల 18వ తేదీన ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియను ముగించుకున్న తర్వాత 25వ తేదీన ఇంటిగ్రెటెడ్ డ్రాఫ్టు జాబితాను విడుదల చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అదే రోజు నుంచి సుమారు నెలరోజుల పాటు అంటే డిసెంబర్ 24వ తేదీ వరకు ఓటరు జాబితా ముసాయిదాపై స్వీకరించిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. వచ్చే జనవరి 10వ తేదీలోపు అన్ని రకాల అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాలని గడువు విధించారు. ఆ తర్వాత సప్లిమెంట్ కోసం జనవరి 17 నుంచి ఏర్పాట్లు చేసి, అదే నెల 20వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలోని ఓటర్లు తమ వివరాలను సరి చూసుకునేందుకు గాను జాతీయ ఎన్నికల సంఘంలో ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. తప్పులను సరి చేసుకునేందుకు ఇప్పటికే పంపిణీ చేసిన నిర్ణీత ఫారాన్ని పూర్తిచేసి సిటిజన్ సర్వీసు సెంటర్లలో, ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయాల్లో సమర్పించవచ్చునని సూచించారు. మార్పులు, చేర్పులు కోరే ఓటరు అందుకు అవసరమైన పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్, బ్యాంకు పాస్‌బుక్, రేషన్‌కార్టుల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

పర్యావరణ సమతుల్యతకు కృషి
*అటవీ శాఖ మంత్రి
ఇంద్రకరణ్ రెడ్డి
కేపీహెచ్‌బీకాలనీ, అక్టోబర్ 18: పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో శుక్రవారం రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంద్రకరణ్ హాజరై మాట్లాడుతూ చెట్లను నరికి వేయడం, అక్రమంగా కలప రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అక్రమాలను అరికట్టేందుకు అటవీ ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపోందించడం వంటి అంశాలపై ఈనెల 28న మంత్రుల కమిటీతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి సర్విస్ మెడల్స్‌ను అందిస్తామని అన్నారు. జనవరి 26 నుంచి సేవా పతకాలు అందించేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి తివారి, పీసీసీ ఎఫ్‌ఆర్ శోభ పాల్గొన్నారు.