హైదరాబాద్

సంక్షోభంలోనూ తప్పని దుబారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : జీహెచ్‌ఎంసీ పరిస్థితి నూరేళ్ల ఆయుష్షు దినదిన గండంగా తయారైంది. మహానగరంలోని కోటి మంది జనాభాకు అత్యవసర, పౌరసేవలను అందించే జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. నిత్యం ఖజానాలో వేల కోట్ల రూపాయలు నిల్వ ఉండే జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ఆస్తిపన్ను వసూలు చేస్తేనే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించే పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన జీతభత్యాలను చెల్లించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. ప్రతి నెల మాదిరిగా ఈ సారి కూడా అందరూ ఉద్యోగులకు ఒకేసారి జీతాలు చెల్లించేందుకు వీలు కలగలేదు. ఖజానాలో డబ్బుల కొరత నెల ప్రారంభం కాగానే ఒకటవ తేదీన చెల్లించాల్సిన జీతాలను ఒకటో తేదీ నుంచి నాలుగైదు తేదీ వరకు విడతలుగా చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. క్షేత్ర స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేసే సిబ్బందికి ఇప్పటికే టార్గెట్లు విధించిన అధికారులు ఈ నెల జీతాలు కావాలంటే మీరు ఖచ్చితంగా పన్ను వసూలు చేయాల్సిందేనని సర్కిల్ స్థాయిలో అధికారులు బహాటంగానే చెబుతున్నట్లు సమాచారం. దీంతో టార్గెట్లు అధిగమించేందుకు ట్యాక్స్ సిబ్బంది ఎడాపెడా పన్ను వడ్డిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసుకుని వేలల్లో పన్ను వడ్డిస్తూ నోటీసులు జారీ చేస్తున్నట్లు సర్కిల్ స్థాయిలో ఫిర్యాదులు కుప్పలుగా వస్తున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు పన్ను వసూళ్ల హడావుడి ఉండేది. కానీ ఈ సారి నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ మాసం నుంచే కలెక్షన్లకు టార్గెట్లు విధించారు. ముఖ్యంగా నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, ననగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేలాది రూపాయలను వెచ్చించి ఎస్‌ఆర్‌డీపీ పనులను చేపట్టడం వల్లే జీహెచ్‌ఎంసీలో నిధుల కొరత తలెత్తింది. ఇప్పటి వరకు మూడుసార్లు బాండ్ల జారీతో రూ. 700 కోట్లను సమకూర్చుకున్న జీహెచ్‌ఎంసీ ఇపుడు తాజాగా రూపే టర్మ్ లోన్ కింద రూ. 2500 కోట్లను అప్పుల చేసేందుకు సిద్ధమైంది. ఈ నిధులను సమకూర్చేందుకు మధ్యవర్తిగా ఓ సంస్థను నియమించుకునేందుకు ఇటీవలే స్థారుూ సంఘం కూడా ఆమోదం ఇచ్చింది. ఈ నిధులు సమకూరిన వెంటనే ఇప్పటికే కోట్ల రూపాయల్లో పేరుకుపోయిన ఎస్‌ఆర్‌డీపీ పనుల బకాయిలు చెల్లించేందుకే సరిపోతోంది. ఈ క్రమంలో మరో,మూడు నాలుగు నెలల్లో ఎస్‌ఆర్‌డీపీ రెండోదశ పనులు ప్రారంభిస్తామని చెబుతున్న అధికారులు నిధులెలా సమకూర్చుకుంటారో వేచి చూడాలి!