హైదరాబాద్

తప్పుడు వివరాలిస్తే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటింటి సర్వేను నిర్లక్ష్యం చేసినా, తప్పుడు వివరాలిచ్చినా చర్యలు తప్పవని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ అధికారులను హెచ్చరించారు. ఇప్పటి వరకు 3423 వాటర్ కనెక్షన్లకు సంబంధించి పూర్తయిన సర్వేపై ఆయన గురువారం బోర్డు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ ఈ సర్వేతో ఇప్పటి వరకు బోర్డుకు రూ.కోటి ఆదాయం, అలాగే నెలకు రూ.10లక్షలు చొప్పున బిల్లుల రూపంలో ఆదాయం సమకూరిందని వివరించారు. సర్వేలో భాగంగా ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని ఇళ్లలో సర్వే నిర్వహించారన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేకు సంబంధించి ఏమైనా అనుమానాలుంటే ఉన్నతాధికారులను ఆశ్రయించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. డొమెస్టిక్, కమర్షియల్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్ కనెక్షన్లు అంటూ తేడా లేకుండా ప్రతి భవనం వాటర్ కనెక్షన్‌కు సంబంధించిన క్యాన్ నెంబర్ సర్వే రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పూర్తయిన సర్వేలోని పది శాతం వివరాలను విజిలెన్స్ సీవీఓ తనిఖీ చేసి, మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. నల్లా కనెక్షన్ లేకున్నా, సీవరేజీ వ్యవస్థను వినియోగిస్తున్న భశనాలను కూడా తనిఖీలు చేసి సీవరేజీ క్యాన్‌నెంబర్లను కేటాయించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సర్వే ఇప్పటి వరకు ఆరు డివిజన్లలో ఐదు బృందాలు 3423 కనెక్షన్లను సర్వే చేసి, అందులో 3293 మంచినీటి కనెక్షన్లను గుర్తించగా, కొత్తగా 130 సీవరేజీ కనెక్షన్లు, 321 కమర్షియల్ కనెక్షన్లు, మరో 143 ఎంఎస్‌బీ కనెక్షన్లు, మరో 33 అక్రమ నల్లా కనెక్షన్లు, రికార్డుల్లో నమోదు చేయని 65 భవనాలు, ఫ్లాట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. సర్వే నిరంతరంగా నగరం నలువైపులా కొనసాగుతోందని తెలిపారు. ఇంకా అదనంగా బృందాలు ఏర్పాటు చేయటానికి మరో 150 మంది సిబ్బందిని అధికారులు గుర్తించాలని ఆదేశించారు. సమీక్షలో భాగంగానే మంచినీటి సరఫరా, సీవరేజీ పైప్‌ల నెట్‌వర్కింగ్, మ్యాపింగ్ వాల్వులు, మ్యాన్‌హోళ్ల గుర్తింపు, జియోట్యాగింగ్ పనుల పరోగతిపై కూడా చర్చించారు. ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రతి క్యాన్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో ఆ ఇంటి వివరాలు సంబంధించిన ఫొటో లింక్ చేయటానికి సాంకేతిక పరిజ్ఞానం రూపొందించాలని అన్నారు.
నగరంలో ప్రతి భవనం ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ‘వాక్’ కార్యక్రమం గురించి ఆరా తీస్తూ ఇంటింటికీ మార్కు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీర కృష్ణ, పీ.రవి పాల్గొన్నారు.
మరో ముగ్గురిపై క్రిమినల్ కేసులు
అక్రమ నల్లా కనెక్షన్లు కలిగిన మరో ముగ్గురు వ్యక్తులపై జలమండలి గురువారం క్రిమినల్ కేసులను నమోదు చేసింది. ఉప్పల్ పరిధిలోని విజయపురికాలనీలో ఒకే ఏరియాలోని మూడు భవనాల్లో అక్రమ నల్లా కనెక్షన్లను జలమండలి అధికారులు గుర్తించారు. యజమానులు లక్ష్మమ్మ, పెంటమ్మ, కిరణ్ కుమార్ రెడ్డిపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.