హైదరాబాద్

అద్భుతం.. ఆదర్శనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరవాసుల దాహర్తి తీరుస్తున్న జలమండలిలో మానవరహితంగా పారిశుద్ధ్య పనులు భేష్‌గా కొనసాగుతున్నాయని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ అభినందించింది. మూడురోజుల నగర పర్యటనలో భాగంగా బుధవారం కమిషన్ చైర్మన్ మన్హర్ వాల్ద్భియ్ జాలా, కమిషన్ సభ్యుడు జగదీశ్ హిరేమణి, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్‌తో కలిసి పారిశుద్ధ్య పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం బోర్డు ప్రధాన కార్యాలయం ఆవరణలో మినీ ఎయిర్ టెక్ యంత్రాలతో చేపట్టిన క్లీనింగ్, జెట్టింగ్, సక్కింగ్ పనులను పరిశీలించారు. మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ మాట్లాడుతూ జలమండలి మానవ రహిత పారిశుద్ధ్య పనుల కోసం మినీ ఎయిర్‌టెక్ యంత్రాలను రూపొందించి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు వివరించారు. సీవరేజీ కార్మికులకు ఎప్పటికపుడు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరికరాలను సమకూరుస్తూ కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగకుండా సీవరేజీ పనులు చేపడుతుందని తెలిపారు. సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ జలమండలి కార్మికులకు అందిస్తున్న ఆక్సిజన్ మాస్కులు, గ్యాస్ డిటెక్టర్లు, సిల్ట్ గ్లాబర్, గౌజెస్‌లతో పాటు ఇతర పరికరాలను పరిశీలించారు. పరికరాలు పనిచేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్మికుల జీతభత్యాలు, వారికి అందించాల్సిన సబ్బులు, వేతనాలు, ఈఎస్‌ఐ వంటి అంశాల గురించి ఆరా తీశారు. పారిశుద్ధ్య పనులను మానవరహితంగా, యంత్రాల ద్వారా జలమండలి ఎంతో అద్భుతంగా, ఆదర్శనీయంగా చేపడుతుందని వివరించారు. అనంతరం అంబర్‌పేటలోని ఎస్‌టీపీని కూడా కమిషన్ చైర్మన్, సభ్యులు సందర్శించారు. కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ పాల్గొన్నారు.