హైదరాబాద్

వామ్మో.. బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బస్సు అంటే మామూలు బస్సు కాదు.. అది ఆర్టీసీ బస్సు. ఒక రూట్‌లో బస్సు నడపాలంటే కొన్ని వందలసార్లు గేర్లు మార్చాలి, మరికొన్ని వందలసార్లు బ్రేక్ తొక్కాల్సిందే. కానీ కండిషన్ అంతంతమాత్రంగా ఉన్నా, పర్మినెంట్ డ్రైవర్లు వీటిని ఎంతో సునాయాసంగా నడిపేవారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా బస్సులను నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లను నియమిస్తోంది. వేల సంఖ్యలోనున్న ఆర్టీసీ బస్సులు ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేవి. కానీ సమ్మె కారణంగా ఇపుడు వాటికి బ్రేక్‌లు పడటంతో వాటిని ప్రత్యామ్నాయంగా నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లకు రోజుకి రూ.1500 చెల్లిస్తామనగానే ఏడాదిన్నర హేవీ డ్రైవింగ్ లైసెన్స్, రెండేళ్ల అనుభవమున్న వారంతా బస్సులను నడిపేందుకు వచ్చేస్తున్నారు. కానీ, వారిలో అరకొర డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న కొంత మంది బస్సును నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.
నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ బస్సు నడిపేందుకు వచ్చిన తాత్కాలిక డ్రైవర్.. కూకట్‌పల్లిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనకా నుంచి గట్టిగా ఢీకొట్టడటంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. ఘటన నుంచి తేరుకున్న ప్రయాణికులు అసలు కారణమేమిటీ? అని గమనించగా, తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించి దేహశుద్ధి చేసిన సంగతి విధితమే. ఈ ఘటన మరవక ముందే అంబర్‌పేటలో మరో ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టడటంతో అతను మృత్యువు బారిన పడ్డాడు. ప్రమాదానికి తాత్కాలిక డ్రైవర్ అరకొర డ్రైవింగ్ నైపుణ్యమే కారణంగా గుర్తించిన ప్రయాణికులు అతనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అడపాదడపా నడుస్తున్న ఆర్టీసి బస్సులు ఎక్కేందుకు జనం భయపడుతున్నారు. మరికొన్ని డిపోల పరిధిలో డిపో నుంచి బస్సు బయటకు తీసిన తర్వాత నిర్ణీత నెంబర్ రూటులో ఎక్కడెక్కడ బస్సు నిలపాలో కూడా తెలియక డ్రైవర్లు అయోమయానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల బస్‌షెల్టర్లు లేకపోవటమే ఇందుకు కారణం కాగా, కొత్త నడిపేందుకు వస్తున్న తాత్కాలిక డ్రైవర్ల అవగాహనరాహిత్యం కూడా మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రద్దీగా వస్తున్న ఈ బస్సుల్లో ఎక్కగానే ఛార్జీలు వసూలు చేసుకుని టికెట్ ఇవ్వకపోవటంతో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రూట్లలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు సమీపంలో ఉన్న స్టాపుల్లో కాకుండా కాస్త దూరంగా బస్సులను ఆపటంతో వయోవృద్ధులు, మహిళలు తిరిగి వెనక్కి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కండీషన్ కాస్త బాగా లేని బస్సులు రన్నింగ్‌లో ఆగిపోవటం, డ్రైవర్ సెల్ఫ్ కొట్టినా స్టార్ట్ కాకపోవటంతో నెట్టి స్టార్ట్ చేసుకోవల్సిన సందర్భాలు సైతం లేకపోలేవు. డ్రైవర్‌కు పూర్తి స్థాయిలో నైపుణ్యత కలిగి, సేఫ్‌గా నడపగలిగితే వంద మంది ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు వెళ్తారనే విషయాన్ని గుర్తించి, తాత్కాలిక డ్రైవర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. సమ్మె కారణంగా అడపాదడపా అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులు సైతం ప్రజలను ఇలా పరేషాన్ చేస్తున్నాయి.