హైదరాబాద్

ముక్తేవి భారతికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ సాహితీవేత్త కనుపర్తి వరలక్ష్మమ్మ జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డా.ముక్తేవి భారతికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో సమావేశంలో మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొని ముక్తేవి భారతికి పురస్కారం ప్రదానం చేశారు. కనుపర్తి వరలక్ష్మమ్మ సాహిత్య రంగానికి చేసిన సేవలను కొనియాడారు. భారత్‌టూడే డైరెక్టర్ బీ.వల్లీశ్వర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రఘుశ్రీ, పాలపర్తి సంధ్యారాణి పాల్గొన్నారు.
పుస్తకాలు ఆవిష్కరణ
కాచిగూడ, అక్టోబర్ 16: యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ 56వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు డా.తిరుమల శ్రీనివాసాచార్య, డా.పుట్టపర్తి నాగ పద్మి, విహారి రచించిన ‘పురాభావ సరస్వతి, అభినవ పోతన’ పుస్తకాల ఆవిష్కరణ సభ యువభారతి ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ కవి సుధామ సభాధ్యక్షత వహించగా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఆచార్య ఫణీంద్ర, జీడిగుంట వెంకట్రావు పాల్గొన్నారు.
కళలకు వయస్సు అడ్డురాదు
కాచిగూడ, అక్టోబర్ 16: వయో వృద్ధులు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ‘సాహిత్య సంగీత, నటన’లో రాణించిన వృద్ధులకు ఆత్మీయ సత్కర కార్యక్రమం అభినందన సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని వివిధ రంగల్లో ప్రముఖులు రావి కొండలరావు, పొత్తూరి సుబ్బారావు, హైమవతి భీమన్నకు ఆత్మీయ సత్కరం చేశారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించి సత్కరించి ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించగా రచయిత్రి డా.కేవీ కృష్ణకుమారి, జీవీఆర్ ఆరాధన సంస్థ చైర్మెన్ గుదిబండి వెంకట రెడ్డి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఈ.్భవాని, డా.జీ.శోభాపేరిందేవి, ఎం.లలితా రావు పాల్గొన్నారు.