హైదరాబాద్

ఆర్టీసీ సమ్మెకు నిమ్స్ కార్మికుల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నిమ్స్ క్యాంటిన్ నుంచి పంజాగుట్ట ప్రధాన రహదారి వరకు ర్యాలీ చేశారు. ఆర్టీసీ జేఏసీ నేత ఏవీ రావు, యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ రావుమాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుండగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆవేదన కలిగించే అంశం పేర్కొన్నారు.
నేటి నుంచి శ్రీసాయి అఖండ ఏకనామ
సంకీర్తనాయజ్ఞ మహోత్సవం
కాచిగూడ, అక్టోబర్ 15: షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి జనవరి 26వ తేది వరకు 101 రోజుల పాటు ‘శ్రీసాయి అఖండ ఏకనామ సంకీర్తనాయజ్ఞ’ మహోత్సవం ఆర్టీసీ వోల్డ్ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు సేవా సమితి చైర్మన్ ఎర్రబెల్లి ఉషా, అధ్యక్షుడు శ్యామ్ సుందర్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సాయిబాబా సమది జరిగి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏకానామ సంకీర్తనాయజ్ఞ మహోత్సవం 101 రోజుల పాటు నిర్వరామంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. సంకీర్తనాయజ్ఞ మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్, అనిత రాములు, రాజశేఖర్ గుప్త, రమేష్ రాము, సుధాకర్ గుప్త, పవన్, వెంకటేశ్, రవీందర్, నేతి సత్యనారాయణ పాల్గొన్నారు.