హైదరాబాద్

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జీ.రవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి ఆర్జీలు, ఫిర్యాదులను స్వీకరించారు. ఆసిఫ్‌నగర్ మండలం బోజగుట్టకు చెందిన బీమమ్మ అనే మహిళా తన కూతురు అనితకు కుల ధ్రువీకరణ పత్రం వచ్చిందని, తన మనువడికి అలాంటి కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కర్ణాటక వారని తిరస్కరించారని ఫిర్యాదు చేశారు. సంబంధిత ఆసిఫ్‌నగర్ తహశీల్దార్ వెంటనే ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జేసీ సూచించారు. దారుస్సలాం ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన సాయి కుమారి 2017లో వికలాంగుల సంస్థ ద్వారా బట్టల వ్యాపారానికి రూ.3లక్షల రుణం మంజూరు అయిందని, కానీ నేటికీ ఇంకా ఆ రుణం విడుదల కాలేదని జేసీకి ఫిర్యాదు చేసింది. స్పందించిన జేసీ సంబంధిత లీడ్‌బ్యాంక్ మేనేజర్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అంబర్‌పేట హరిజన అండ్ గిరిజన సేవా సంఘం సొసైటీ ఆరో నెంబర్ వద్ద ఉన్న తమ బస్తీ న్యూ అంబేద్కర్‌లో ప్రభుత్వం దవాఖానా లేకపోవడంతో బస్తీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తమ బస్తీలో బస్తీ దవాఖానాను నిర్మించాలని కోరుతూ వినతిపత్రాన్ని జేసీకి సమర్పించారు. స్థానికుల వినతిని పరిశీలించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్ ప్రమోదిని, హైదరాబాద్, సికిందరాబాద్ ఆర్డీఓ శ్రీనివాస్ గౌడ్, రాజూగౌడ్, ఎల్‌పీఓ కుమారి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సూర్యలత, సీపీఓ రామభద్రం, వేల్ఫేర్ అధికారి ఝాన్సీలక్ష్మి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఖాసిం, డీఈఓ వెంకటనర్సమ్మ, ఏఓ అశోక్ రెడ్డి హాజరయ్యారు.