హైదరాబాద్

కార్మికుల ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉద్యోగాల నుంచి తొలగించారనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని తెలుగుదేశం పార్టీ నగర నాయకుడు పీ.సాయిబాబా అన్నారు. ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన కార్వాన్‌కు చెందిన సురేందర్ గౌడ్ బాధిత కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి పరామర్శించారు. సాయిబాబా మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకు పోరాటమే స్పూర్తి అని, అమరవీరుల మాదిరిగా పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని సూచించారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడి ఆర్టీసీ కార్మికులు తమ జీవితాలు ఎక్కడ రోడ్డుపాలవుతాయోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు కూడా పరిష్కారం కాదని, కార్మికులు పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు పాపం పుణ్యం ఎరగని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల స్పందించకపోవటం శోఛనీయమని అన్నారు. టీడీపీ నేతలు పీ.బాలరాజ్ గౌడ్, పీ.రవీంద్రా చారి, ప్యాట నందకిశోర్, నాగూ నాగేశ్, సత్యనారాయణ, అంజద్ అలీఖాన్, సురేందర్, యాదగిరి ఉన్నారు.