హైదరాబాద్

పోలీసుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లోని ఇంద్రానగర్‌లో శనివారం రాత్రి పోలీసులు కార్డెన్ సర్చ్‌ను నిర్వహించారు.
పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సుమతి ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లకు చెందిన అధికారులు, సిబ్బంది తనిఖీలను చేపట్టారు. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న నేతృత్వంలో జూబ్లీహిల్స్ సీఐ బలవంత రావు, బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌తో పాటు 10 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లు, ఎనిమిది మంది ఏఎస్‌ఐలు, 66 మంది కానిస్టేబుళ్లు, 11 మంది హోంగార్డులు తనిఖీల్లో పాల్గొన్నారు.
సుమారు ఐదు గంటల పాటు కొనసాగిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 44 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది హిజ్రాలను, 87 మంది అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారు. స్థానికంగా జులాయిగా తిరుతున్న 110 మంది యువకులను ఒక చోట చేర్చి కౌనె్సలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. పోలీస్ అధికారలు మాట్లాడుతూ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నగర ప్రజలకు బరోసా కల్పించేందుకే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తనిఖీలు నిర్వహించామని చెప్పారు. నగరాన్ని సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు, అన్ని సమయాల్లో పోలీసులు తమ వెంట ఉన్నారన్న ధైర్యాన్ని నింపేందుకు నిర్వహించే తనిఖీలకు నగర ప్రజల ఎలాంటి భయాందోళనకు గురికాకుండా సహరించాలని అన్నారు. స్థానికంగా జరిగే అంశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.