హైదరాబాద్

భారతీయ విజ్ఞానాన్ని పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: భారతీయ విలువలు, విజ్ఞానాన్ని పరిరక్షించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
ఆదివారం ఖైరతాబాద్‌లోని విశే్వశ్వరయ్య భవన్‌లో జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్యోతిష్యంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును హరీష్ రావు ప్రారంభించారు. సమాజాన్ని నడిపించేది నమ్మకాలు, విశ్వాసాలని అన్నారు. జ్యోతిష్యం కూడా విశ్వాసంపై ఆధారపడిందేనని అన్నారు. వైద్యుని వద్దకు వెళ్తే ప్రస్తుత సమస్యకు మాత్రమే పరిష్కారం లభిస్తుందని, ఆస్ట్రాలజిస్ట్ భవిష్యత్‌లో తలెత్తే సమస్యను వివరించి వాటిని ఎలా పరిష్కరించుకోనే మార్గాని సూచిస్తారని అన్నారు. అది ఎంత వరకు కచ్చితమైనేది పక్కన పెడితే నిరాశను వీడి భవిష్యత్‌లో మంచి జరుగుతుందనే విశ్వాసంతో పనిచేయడంతో ఫలితాలు అద్బుతంగా వస్తాయని అన్నారు. పూర్వం రాజుల కాలంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ఆదరణ ఉండేదని, వేల ఏళ్ల నాడే గ్రహ స్థితిగతులు, వాటి సంచారాలను తెలుసుకొని భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పిన ఘనత భారతీయ జ్యోతిష్య పండితులకే సొంతం అని అన్నారు. శాస్ర్తియ పద్దతిలో జ్యోతిష్యానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ పౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. యోగ సంస్కృతం విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీ ఆర్ ఏ రాజు, జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతులైన వారిని మంత్రి ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో గురువాయర్ దేవాలయ ఆచార్యులు మురళీ పాల్గొని భగవద్గీత విశిష్టతను వివరించారు. యోగా, జ్యోతిష్యం తదితర కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి డాక్టరేట్లను ప్రదానం చేశారు.