హైదరాబాద్

బోయ కులస్థులను ఎస్‌టీ జాబితాలో చేర్చేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : బోయవాల్మికి కులాలను ఎస్‌టీ జాబితాలో చేర్చే విషయంపై కేంద్ర మంత్రిగా తనవంతు సహయ, సహకారం అందిస్తానని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జీ.కిషన్ రెడ్డి అన్నారు. మహర్షి వాల్మికి జయంతి సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి పాల్గొని మహర్షి వాల్మికి చిత్ర పటానికి నివాళి అర్పించి ప్రసంగించారు. వాల్మికి సనాతన భారత సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తారని తెలిపారు. రామాయణం రచించి దేశానికి ఆదర్శ జీవితాన్ని అందించి మహానీయుడు మహర్షి వాల్మికి అని కిర్తించారు. రామాయణంలో మానవ సంబంధాలను ఉత్తమమైన రామ, లక్ష్మణ్ పాత్రల ద్వారా సమాజానికి మహోన్నతంగా అందించారని పేర్కొన్నారు. తెలంగాణ ఎక్సెజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం పెంపొందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ, ఆర్థిక విద్య అభివృద్ధి పథకాలను ఆమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితా రాజేంద్ర, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన రావు, ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర వినియోగదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గట్టు తిమ్మప్ప పాల్గొన్నారు.