హైదరాబాద్

సఫాయి కర్మచారి సంక్షేమానికి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరం పరిధిలో మ్యానువెల్ స్కావెంజింగ్ వృత్తిలో కొనసాగిన వారి సంక్షేమానికి ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. 16 సంవత్సరాల క్రితం అంటే 2003లోనే మ్యానువెల్ స్కావెంజింగ్‌ను పూర్తిగా నిషేధించామని, ఆ తర్వాత ఈ వృత్తిలో కొనసాగుతున్న వారు కూడా దాన్ని మానేసినట్లు తెలిపారు. అంతకు ముందు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవించిన వారి వివరాలను సేకరించాలని నిర్ణయించామని కమిషనర్ తెలిపారు. సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులతో బుధవారం కమిషనర్ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ సఫాయి కర్మచారి సంక్షేమానికి, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి ప్రణాళికల రూపకల్పన కోసం జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోందని తెలిపారు. సఫాయి కర్మచారి కార్మికుల పూర్తి వివరాలను జీహెచ్‌ఎంసీకి అందజేయాలని సమావేశానికి హాజరైన ప్రతినిధులకు కమిషనర్ సూచించారు. ఇప్పటి వరకు నగరంలో 140 మంది వివరాలను జీహెచ్‌ఎంసీ సేకరించిందని, వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన బీఓటీ టాయిలెట్ల నిర్వహణను సఫాయి కర్మచారి సంఘాలకు అందజేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో పలు ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన కాంట్రాక్టులను మేదరి సామాజిక వర్గానికి అందేలా టెండర్ల నిబంధనలో మార్పులు చేయాలని కోరుతూ త్వరలోనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభాగంలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పలువురు కార్మికులున్నారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులందరికీ ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని కమిషనర్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. 2015 నుంచి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో 223 మందికి కారుణ్య నియమాకాలను చేయగా, వీటిలో 33 మంది సఫాయి కర్మచారి వర్గానికి చెందిన వారున్నారని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పిరధిలో సఫాయి కర్మచారి కార్మికులకు ఏ వధమైన సమస్య ఉన్నా, నిబంధలను అనుసరించి పరిష్కరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం
ఖైరతాబాద్, అక్టోబర్ 9: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని మాక్సివిజన్ ఐ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జీఎస్‌కే వేలు అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో విలేఖరుల సమావేశంలో వరంగల్‌లోని శరత్ ఐ ఆసుపత్రి శరత్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. కంటి వైద్య చికిత్సల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న చికిత్స పద్దతులను రెండవ శ్రేణి నగరాల్లో నివసిస్తున్న వారికి అందించేందుకు వివిధ ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. వరంగల్‌లోని శరత్ ఐ ఆసుపత్రితో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఇప్పటి నుంచి శరత్ మాక్సివిజన్‌గా కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో వైద్యులు కాసు ప్రసాద్ రెడ్డి, అన్నపూర్ణ, గణేష్ పాల్గొన్నారు.