హైదరాబాద్

వరుణుడి ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంపై వరుణుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. గడిచిన కొద్దిరోజులుగా నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే నగరంలోని దాదాపు అన్ని మెయిన్‌రోడ్లు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. నిత్యం రద్ధీగా ఉండే వీఐపీ జోన్‌లోని లక్డీకాపూల్, పంజాగుట్ట, బేగంపేట, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నాంపల్లి, ఎంజే మార్కెట్‌లోని పలు మెయిన్ రోడ్లు రాకపోకలు సాగించేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. బుధవారం మధ్యాహ్నం మరోసారి కుండపోత వర్షం కురిసింది. నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ ప్రాంతంలోనే అత్యధికంగా 39.3 మి.మీ., అత్యల్పంగా ఎల్‌బీ స్టేడియం సమీపంలోని గన్‌ఫౌండ్రీ ప్రాంతంలో 6.8 మీ.మీ. వర్షపాతం నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నాం గంటన్నర నుంచి రెండు గంటల కురిసిన వర్షం ఆగిన తర్వాత కూడా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మొదలుకుని లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల, హోటల్ వైస్రాయ్ సిగ్నల్ వరకు వాహనాలు క్యూ కట్టాయి. మరోవైపేమో రోడ్లకు ఎప్పటికపుడు మరమ్మతులు చేయాల్సిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ నగరంలోని మొత్తం 830 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉండగా, ఇప్పటికే 610 కిలోమీటర్ల రోడ్డు వేశామని చెప్పటం గమనార్హం. వీటిలో ఎక్కువ శాతం రోడ్లను బడాబాబులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే వేసినట్లు కూడా వాదనలు విన్పిస్తున్నాయి. సిటీకే ప్రైమ్ లొకేషన్‌గా ఉన్న లక్డీకాపూల్‌లోని రోడ్లు పూర్తిగా గుంతలమయమయ్యాయి. లక్డీకాపూల్‌లోని బీజేఆర్ కాలేజీ రోడ్డు పూర్తిగా గుంతలమయం కావటంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. దీని ప్రభావం ఖైరతాబాద్, లక్డీకాపూల్ జంక్షన్లపై పడి తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోజూ కురుస్తున్న వర్షం ప్రభావం జనజీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చివరకు దసరా పర్వదినమైన మంగళవారం కూడా మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టడటంతో ప్రజల్లో పండుగ ఉత్సాహం తగ్గింది. నగరంలోని చింతల్‌బస్తీ, అంబర్‌పేటతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈ సారి కూడా ఆనవాయితీగా నిర్వహించిన రావణ దహనం కార్యక్రమానికి పెద్దగా జనం రాలేదు. మరికొన్ని చోట్ల రావణ దహనానికి ఏర్పాట్లు చేసిన మైదానాలు జనం లేక వెలవెలబోయాయి. పండుగ రోజుతో పాటు మరుసటి రోజైన బుధవారం మధ్యాహ్నాం నుంచి రెండు గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
గుంతలు.. ఇరువైపులా కుప్పలు
మహానగరంలో నిత్యం రద్ధీగా ఉండే రోడ్లను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. వీఐపీ జోన్‌లోనూ నిత్యం రద్ధీగా ఉండే పలు ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లు పూర్తిగా గుంతలమయం కావటంతో పాటు రోడ్లకిరువైపులా చెత్తలు కుప్పలుగా పేరుకుపోయాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గాష్టమి పూజలు నిర్వహించిన్పటి నుంచి బుధవారం సాయంత్రం వరకు చెత్త సేకరించే జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంతంతమాత్రగానే విధులకు హాజరయ్యారు. పండుగ సెలవులతో శానిటేషన్ పనులు, వర్షం కురిసినపుడు రోడ్లపై నీరు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమబద్ధీకర వంటి సహాయక చర్యలు అంతంతమాత్రంగా కొనసాగాయి.