హైదరాబాద్

నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ దేశంలో ఎక్కడ కూడా లేదని, ఈ ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ కోసం రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల 86 వేల చీరలు, వికారాబాద్ జిల్లాలో 2 లక్షల 26 వేల చీరలు మహిళలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా చీరల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి రెండు లక్షల మంది ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా చేనేత కార్మికులకు కూడా పెద్దఎత్తున ఉపాధి లభించిందని, దీని కోసం 313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని, 100 రకాల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మోయినాబాద్, కొత్తూరు గోడౌన్‌ల ద్వారా వీటిని ఆయా మండలాలకు సరఫరా చేసి పంపిణీ చేస్తామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరను అందించనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ తదితర గుర్తింపు కార్డుపై ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. మొయినాబాద్ గోడౌన్‌లో లక్షా 67202 చీరలు, కొత్తూరు గోడౌన్‌లో 2 లక్షల 22324 చీరలు ఉంచినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో 2 లక్షల 26 వేల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వాటిలో వికారాబాద్ నియోజకవర్గంలో ఆరు మండలాలు, ఒక మున్సిపాలిటీలలో 61943 చీరలు, పరిగి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీలో 49256 చీరలు, తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీలో 58969 చీరలు, కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు, ఒక మున్సిపాలిటీలో 37497 చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్వంలో నిర్వహించనున్నట్లు మంత్రి సబితా రెడ్డి తెలిపారు.