హైదరాబాద్

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : దసరా పండుగను పురస్కరించుకుని మహిళలు తమ ఆటాపాటతో జరుపుకునే బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్దమైంది. మహానగరానికి ఈ సారి 15లక్షల 40వేల 718 చీరలను పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు మొదటి దశగా 4లక్షల 19వేల 100 చీరలను ప్రభుత్వం బల్దియాకు అందించినట్లు అధికారులు తెలిపారు. మరో 11లక్షల 21వేల 618 చీరలను కూడా త్వరలోనే అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ నుంచి బతుకమ్మ చీరలను పంపిణీని ప్రారంభించేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సర్కిళ్ల స్థాయిలో కూడా పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి తొక్కిసలాట, గందరగోళం లేకుండా ఫుడ్‌సెక్యూరిటీ కార్డున్న లబ్దిదారులను గుర్తించి, వారికి ఈ చీరలను పంపిణీ చేయాలని బల్దియా ఉన్నతాధికారులు సర్కిళ్ల వారీగా ఉన్న డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఇందుకు గాను ప్రతి డిప్యూటీ కమిషనర్ తమ సర్కిల్ పరిధిలోని పేదలు నివసించే మురికివాడలు, మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీలు, కాలనీల వారీగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సమక్షంలో ఈ చీరలను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఆయా మురికివాడ, బస్తీ,కాలనీల్లోని కమ్యూనిటీ హాళ్లు, కాలనీ సంక్షేమ సంఘాల ఆఫీసులు, స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారురాలికి ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలోని ముప్పై సర్కిళ్లలో అత్యధికంగా లక్షా 17వేల 887 చీరలను సంతోష్‌నగర్ సర్కిల్‌కు, ఆ తర్వాత 94వేల 887 చీరలను మలక్‌పేటకు మంజూరు కాగా, అత్యల్పంగా కేవలం 16వేల చీరలను హయత్‌నగర్ సర్కిల్‌కు ప్రభుత్వం మంజూరు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.