హైదరాబాద్

దసరాలోపు పీఆర్‌సీ ప్రకటించక పోతే సమరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : దసరా పండుగలోపు ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకటించక పోతే ప్రభుత్వంపై సమరనాదం పూరిస్తామని టీఎన్‌జీఓలు హెచ్చరించింది. శనివారం ఎర్రమంజిల్‌లోని జలసౌద ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నగర శాఖ అధ్యక్షుడు ప్రతాప్‌ను ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌తో కలిసి ప్రతాప్ మాట్లాడారు. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. నిత్యం ధనిక రాష్ట్రం అని చెప్పే పాలకులు ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన పీఆర్‌సీని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో జాయింట్ సెక్రెటరీ అనిత, శ్రీరామ్, విజయ్ మోహన్‌రావు, విఠల్ బాబు, బాలరాజు, ఆంజనేయులు, నాగిరెడ్డి, వినోద్ పాల్గొన్నారు.