హైదరాబాద్

బహుజన సాహిత్య జాతీయ సదస్సుకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్ : బహుజన సాహిత్య అకాడమీ ఈ నెల 29న ముంబైలో నిర్వహించనున్న జాతీయ సదస్సుకు నగరానికి చెందిన సామాజిక కార్యకర్త కృష్ణపూజారికి ఆహ్వానం పలికారు. ఈ సదస్సుకు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవాకు చెందిన 500 మంది ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుగానున్నట్లు కృష్ణపూజారి తెలిపారు.
ఈ సదస్సులో ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న వేధింపులు, ఇపుడున్న చట్టాలు అమలు తీరుతెన్ను, మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సదస్సు తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులోనే సికిందరాబాద్ అడ్డగుట్టకు చెందిన గంటా రాజుసాగర్‌కు జాతీయ సేవా రత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు కృష్ణపూజారి వివరించారు. సదస్సుకు తనను ఆహ్వానించినందుకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యన్‌తో పాటు బీఎస్‌ఏ జాతీయ, ప్రాంతీయ నాయకులకు కృష్ణపూజారి కృతజ్ఞతలు తెలిపారు.