హైదరాబాద్

మూణ్ణాళ్ల ముచ్చటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకవైపు మహానగరంలో వ్యాధులు విజృంభించి వంద సంఖ్యలో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇతర వ్యాధుల బారిన పడి జనం అల్లాడిపోతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహారిస్తున్నారు. తొలుత సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నపుడు ప్రాథమిక దశలోనే అధికారులు వ్యాధి నివారణ చర్యలు చేపట్టకపోవటం వల్లే నేడు వంద సంఖ్యలో జనం డెంగ్యూ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి మున్సిపల్ మంత్రి కేటీఆర్ తనతో పాటు బల్దియాకు చెందిన ప్రతి అధికారి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించించారు. ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఇతర రాజకీయ ప్రముఖులు తమ ఇళ్లలో నీటి నిల్వలను తొలగించుకున్నారు. ఆ తర్వాత అంతా షరామామూలే అన్నట్టు మంత్రి ఆదేశాలను బేఖాతారు చేస్తూ రొటీన్ పనుల్లో బిజీ అయిపోయారు. కమిషనర్, అదనపు, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు శానిటేషన్, ఎంటమాలజీ విభాగం అధికారులు ఉదయం ఐదున్నర గంటల కల్లా క్షేత్ర స్థాయి విధుల్లో రిపోర్టు చేయాలని సాక్షాత్తు మున్సిపల్ మంత్రి కేటీఆర్ జారీ చేసిన ఆదేశాలు సైతం ఎక్కడా అమలు కావటం లేదు. వ్యాధులను అరికట్టడటంలో వైద్యారోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా, ఉభయ శాఖలు ఇప్పటి వరకు నగరంలో ఎక్కడా కూడా సమష్టిగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. వ్యాధుల ప్రభావం రోజురోజుకీ పెరిగి, సర్కార్ ఆసుపత్రులు రోగులకు కిటకిటలాడుతున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రోజుకి సుమారు రెండు వేల మంది ఔట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారంటే వ్యాధుల తీవ్ర ఏ మేరకు ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజు అతనే స్వయంగా తన నివాసమైన ప్రగతి భవన్‌లో, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తన నివాసంలో నీటి నిల్వలను తొలగించుకున్నారు. ఇదే ఉత్సాహాం జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన వ్యాధి నివారణ చర్యలపై ఎప్పటికపుడు పర్యవేక్షించే అంశంపై చూపితే ఇప్పటి వరకు వ్యాధుల ప్రభావం కొంత మేరకైనా తగ్గి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎంటమాలజీ విభాగం అధికారులు తూతూమంత్రంగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు ఇళ్లలో నీటి నిల్వలను తొలగిస్తున్నారు. మరోసారి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వ్యాధి నివారణ చర్యలపై సమీక్షా నిర్వహించి, రోజువారీ నివేదికలు తెప్పించుకుంటే తప్ప, ఈ చర్యలు ముమ్మరంగా సాగే అవకాశాల్లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.