హైదరాబాద్

గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కౌమార దశలో ఉన్న విద్యార్థినిలు ఆత్మస్ధైర్యంతో మెలిగేందుకు గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కౌమార దశ నుంచి మార్పు చెంది, పరిపూర్ణ వ్యక్తిగా ఎదుగుతారని వివరించారు. అమ్మాయిలు కౌమార దశలో ధైర్యంగా సమాజంలో నిలదొక్కుకుని పరిపూర్ణంగా ఎదిగేందుకు స్కూల్ ఫర్ గర్ల్ చైల్డ్ ఎంపావర్‌మెంట్ క్లబ్‌లు దోహదపడుతాయని వివరించారు. హైదరాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన 12 పాఠశాలల్లో ఈ క్లబ్‌లను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాలుగు పాఠశాలలో క్లబ్‌లను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్కూల్ క్లబ్‌లలో విద్యార్థినులు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఈవ్ టీజింగ్, మంచి, చెడు స్పర్శలకు తేడాలు, కౌమారదశలో శారీరకంగా వచ్చే మార్పులను తెల్సుకుంటూ అందుకు అనుకూలంగా వ్యవహారించిన తీరు వంటి అంశాలపై వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తామని వివరించారు. ఈ విషయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు దృశ్యమాలికలను ప్రదర్శించి, వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. చట్టపరంగా వారికి ఉన్న హక్కులపై కొంతమంది విద్యార్థులకు భోధించి, వారి ద్వారా తరగతిలో మిగిలిన విద్యార్థినులకు చెప్పేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లోని విద్యార్థినిలకు రక్తపరీక్షలు నిర్వహించాల్సిందిగా జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని ఆదేశించారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పది శాతానికి తగ్గకుండా కావల్సిన ఐరన్ మాత్రలు ప్రతిరోజు విద్యార్థుల తీసుకునేలా శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వెంకటి, డీఈఓ వెంకటనర్సమ్మ, బీసీ సంక్షేమ శాఖ అధికారి విమలాదేవి, జిల్లా సంక్షేమాధికారి ఝాన్సీ లక్ష్మి హాజరయ్యారు.
పొగాకు సేవిస్తే
ఆరోగ్యంపై దుష్ప్రభావం
పొగాకు సేవించటంతో ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందని, దాన్ని నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ సూచించారు. పొగాకు నియంత్రం కార్యక్రమం అమలు తీరుపై సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు అధికంగా వినియోగించటంతో అనేక మంది నోటి క్యాన్సర్, మధుమేహాం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, వీటిని నియంత్రించటం చాలా అవసరమని సూచించారు. విద్యా సంస్థలు, కళాశాలను పొగాకు నిషేధిత ప్రాంతాలుగా బోర్డులు పెట్టాలని ఆదేవించారు. క్లస్టర్ వారీగా బృందాలుగా ఏర్పడి ధూమపానం ఎక్కువగా చేసే ప్రాంతాలను గుర్తించి నియంత్రించేందుకు చర్యలు తీసుకొవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. హైదరాబాద్ జిల్లాను పొగాకు రసిత జిల్లాగా మార్చేందుకు వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.వెంకటి, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ శ్రీకళ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సునీతా రెడ్డి, ఇండినయ్ డెంటల్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీకాంత్ పాల్గొన్నారు.