హైదరాబాద్

‘విశే్వశ్వరయ్య మెమోరియల్’ అవార్డులు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ఇంజనీర్లకు ‘విశే్వశ్వరయ్య మెమోరియల్ అవార్డులు’ ప్రదానోత్సవ కార్యక్రమం మెగాసీటీ నవ కళావేదిక ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొని ఇంజనీర్లకు అవార్డులను ప్రదానం చేశారు. విశే్వశ్వరయ్య దేశానికి అనేక సేవలందించారని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా అవార్డులను ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞశర్మ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ డీకే రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు కరాటే కృష్ణ, నటుడు హరినాథ్ బాబు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున రావు, రాఘవ, సాయినాథ్, సాయికుమార్ పాల్గొన్నారు.

నాటకాలను పరిరక్షించుకోవాలి
కాచిగూడ, సెప్టెంబర్ 16: పౌరాణిక, పద్య నాటకాలను పరిరక్షించుకుని భావితరలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ అన్నారు. రవి అండ్ రవి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ప్రేమకు పరాకాష్ట, అరుణోదయం’ నాటక ప్రదర్శన సోమవారం చిక్కడపల్లి సీటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివకుమార్ పాల్గొని ప్రసగించారు. కళలు, కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి వాఠిని ప్రొత్సహిస్తుందని పేర్కొన్నారు. రక్తకన్నీరు నాగభూషణం అవార్డు గ్రహీత మాడుగుల కృష్ణమోహన్ దర్శకత్వంలో ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. నాగభూషణం 500వందల సార్లు ప్రదర్శించిన ‘తాళెందుకు - ఎగతాళికా’ నాటిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త యడవల్లి శర్మ, వ్యాపార వేత్త ఎంవీవీ సత్యనారాయణ, నగర కేంద్ర గ్రంథాలయం కార్యదర్శి పద్మజ, కళాభిమాని సోమయ్య పాల్గొన్నారు.