హైదరాబాద్

నగరవాసులు ఆరుగురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, గచ్చిబౌలి : గోదావరి పాపికొండల విహారయాత్రలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో బోడుప్పల్ శ్రీనివాస కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జానకిరాం భార్య శివజ్యోతి మరణించారు. సీహెచ్. జానకిరామ్ బావ మరిది పవన్, అతని భార్య వసుంధర, వీరి కుమారుడు సుశీల్ (ఆర్టీసీ కాలనీ) ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారి సహాయక చర్యలు కొనసాగుతున్నాయ. ప్రమాదం జరిగిన దేవీపట్నం గలుచూరు వద్ద ప్రవాహం ఎక్కువగా వుందని ఆప్రాతంలో సుడిగుండం వుంటుందని అదే ప్రమాదానికి యమగండంగా మారిందని బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణ చెప్పారని గల్లంతైన వారి బంధువులు అంటున్నారు. శ్రీకాకుళానికి చెందిన వీరు రెండు రోజుల క్రితం కాలనీలో గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొని కాలనీ ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. శనివారం కారులో ఇక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లిన వీరు బోటు ప్రయాణంలో శివజ్యోతి మరణించగా భర్త జానకిరాం క్షేమంగా బయటపడినట్లు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. శివజ్యోతి మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మాదాపూర్‌కు చెందిన ఎర్రన్ సాయి కుమార్ స్నేహితులతో కలసి పాపికొండలకు విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యాడు. సాయి కుమార్ మాదాపూర్‌లోని జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. సాయి కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుంటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన బోటులో వెళ్లినట్లు సాయి కుమార్‌తో వెళ్లిన స్నేహితుడు మియాపూర్‌కు చెందిన అక్బర్ చెప్పడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. హయత్ నగర్‌కుచెందిన విశాల్,్భరణికుమార్ గల్లంతైనట్లు సమాచారం.