హైదరాబాద్

న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర మీద సినిమా తీసిన చిరంజీవి తమకు న్యాయం చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ఎదుట ఉయ్యాల వాడ వంశీయులు ఆందోళన చేపట్టారు. సైరా నర్సింహారెడ్డి పేరుతో తెరకెక్కించిన చిత్రాన్ని తమ ఇంటి వంశస్థుడైన నర్సింహారెడ్డి చరిత్రను తమ నుంచి తెలుసుకొని చిత్రాన్ని నిర్మించారని అన్నారు. గతంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చిరంజీవి ఇప్పటి వరకు తమకు ఎలాంటి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ వంశీయులకు న్యాయం చేసిన తరువాతే సినిమాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడి చేరుకొని వారిని అదుపులోనికి తీసుకున్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు.
రమ్యా సుబ్రహ్మణ్యన్ భరతనాట్య అరంగేట్రం నేడు
కాచిగూడ, సెప్టెంబర్ 14: ప్రముఖ నృత్య కళాకారిణి రమ్యా సుబ్రహ్మణ్యన్ భరతనాట్య అరంగేట్రం శంకరనందా కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రదర్శన ఈనెల 15వ తేది ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, సంస్థ డైరెక్టర్ డా. ఆనంద శంకర్ జయంత్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని అన్నారు.
ఎగ్జిబిషన్లతో చేనేతకు ప్రోత్సాహం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 14: వివిధ నగరాల్లో కొలువుదీరుతున్న ఎగ్జిబిషన్లతో చేనేత కళాకారులకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందని వర్ధమాన తార సంధ్య అన్నారు. శనివారం శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్‌ఎక్స్ పోను ప్రారంభించారు. చేనేత కళాకారులు రూపొందించిన దుస్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్ల ద్వారా లభిస్తుందని అన్నారు. వ ఈనెల 22 వరకు కొనసాగే ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు, చేతివృత్తిదారులు రూపొందించిన గృహోపకరణాలను అందుబాటులో ఉంచుతున్నట్టు నిర్వాహకులు జయేష్ తెలిపారు.