హైదరాబాద్

ప్రశాంతంగా మొహరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : పాతబస్తీలో నిర్వహించిన మొహరం ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. పాతబస్తీలోని ప్రసిద్ధ బీబీకా ఆలం నుంచి ప్రారంభమయిన మొహరం ఊరేగింపు ప్రశాంతంగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య కొనసాగింది. డబీర్‌పురా నుంచి చార్మినార్ వరకు జరిగిన ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి భద్రతకు సంబంధించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికపడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మొహరం సందర్భంగా జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్‌తో పాటు ఇతర శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. చార్మినార్ వద్ద మొహరంలో పాల్గొన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ దట్టీలు సమర్పించారు. కార్యక్రమంలో నగర పోలీసు అదనపు కమిషనర్లు అనిల్ కుమార్, షికాగోయల్, చౌహన్, అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మిరీఅలం మండి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఏంపీ అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్.హనుమంత్ రావుతదితరులు పాల్గొన్నారు. మొహరం సందర్భంగా బీబీకా అలంకు పాతబస్తీకి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్, మాచమోని ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని దట్టీలు సమర్మించారు.