హైదరాబాద్

ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ సాహితీవేత్త ఆచార్య టీ.గౌరీశంకర్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి శ్రీకృష్ణ మందిరంలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి ముగింపు వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. హిందు ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడని, లోక కల్యాణం కోసం జన్మించారని వివరించారు. యాదవులు శ్రీకృష్ణుడిని కులదైవంగా కొలుస్తారని తెలిపారు. చిన్నారులు కృష్ణ, గోపికల వేషదారణలతో అందరిని ఆకట్టుకున్నారు. గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదలను స్వీకరించారు.

తెలంగాణ వికాసానికి పోరాటం చేసిన దేవులపల్లి రామానుజ రావు
కాచిగూడ, ఆగస్టు 25: తెలంగాణ వికాసానికి నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి దేవులపల్లి రామానుజ రావు అని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ అయాచితం శ్రీ్ధర్ అన్నారు. ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజ రావు జయంతి సభ నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయాచితం శ్రీ్ధర్ పాల్గొని రామానుజ రావు చిత్రపటానికి నివాళి అర్పించారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాటం చేశారని కీర్తించారు. తెలుగు భాషా అభివృద్ధితో పాటు గ్రంథాలయాలను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, కే.శ్రీనివాస్ పాల్గొన్నారు.

అందంతో ఆత్మవిశ్వాసం
ఖైరతాబాద్, ఆగస్టు 25: అందంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని నటి జూహి చవాన్ పేర్కొన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ బాడీ కేర్ అండ్ స్కిన్ సెంటర్‌ను మిసెస్ పసిపిక్ ఏషియా సుధాజైన్‌తో కలిసి ప్రారంభించారు. భాగ్యనగరం ఫ్యాషన్ ప్రియులకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ ఎండీ అమిత్, వైద్యులు హరిరెడ్డి, సుకన్య నీలం పాల్గొన్నారు.