హైదరాబాద్

జ్వరాలతో విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరానికి జరమొచ్చింది. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పలు ప్రాంతాల్లో రోడ్లకిరువైపులా రోజుల తరబడి వర్షపు నీరు నిల్వటం వంటి కారణాలతో దోమలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో ఇప్పటికే డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలినట్టు కేసులు కూడా నిర్దారణ అయ్యాయి. పలువురు సామాన్యులతో పాటు కొందరు పోలీసు అధికారులకు కూడా డెంగీ వ్యాధి సోకినట్లు ఇప్పటికే నిర్థారణ కాగా, అనుమానిత లక్షణాలతో అనేక మంది ప్రైవేటు క్లినిక్‌లలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి సీజనల్ వ్యాధులతో రొటీన్ రోజుల్లో వచ్చే రోగుల సంఖ్య రెట్టింపు కావటంతో సాయంత్రం నాలుగు గంటల వరకు ఔట్ పేషెంటు విభాగాన్ని అందుబాటులో ఉంచారు. దీంతో పాటు నిలోఫర్ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, గోల్కొండ ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో కూడా రోగుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు వాతావరణంలో మార్పులో, పేద, మధ్య తరగతి ప్రజల దురదృష్టమో తెలీదు కానీ ప్రైవేటు క్లీనిక్‌లలో వైద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. వీరిలో ఎక్కువ మంది జలుబు, తలనొప్పి, కడుపునొప్పి, వంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నా వారే ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చిన మలేరియా, డెంగీ వ్యాధుల అనుమానిత లక్షణాల కేసులే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నా, లాంటి లక్షణాలతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేకపోవటంతో ప్రైవేటు క్ల్లినిక్‌లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న వారు నగరంలోని సుమారు 1600 మురికివాడల్లోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. నగరంలో బస్తీదవాఖానాలు అందుబాటులో ఉన్నా, వాటిలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు నిర్థారించేందుకు కావల్సిన టెస్టులు నిర్వహించే అవకాశం లేకపోవటంతో మురికివాడల్లోని పేదలు ప్రైవేటు క్లీనిక్‌ను ఆశ్రయించక తప్పటం లేదు.