హైదరాబాద్

జిల్లెల్లగూడా ఆలయంలో పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా జిల్లెల్లగూడా గ్రామంలోని శ్రీమత్స్యావతార శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మొట్టమొదటి సారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రథమ పవిత్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆలయం కార్యనిర్వహణాధికారి మురళీకృష్ణ, ఆలయ పూజారి డి. రామాచారి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ రాజా సంజయ్ గోపాల్ సైచర్ తెలిపారు. ఆగస్టు 25 నుండి 28 వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఆగస్టు 25 న కార్యక్రమాల అంకురారోపణం, 26 న ప పవిత్ర అధివాసం, 27 న పవిత్రారోహణం, 28 న పవిత్రావరోహణం ఉంటాయి. నాలుగురోజుల పాటు రోజూ నిత్యహోమం, శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం, తీర్థప్రసాదగోష్టి ఉంటాయి.