హైదరాబాద్

26న ఇందిరాపార్కు వద్ద టీడీపీ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించటంతో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి, ఉద్యోగ, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు టీడీపీ ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని నగర తెలుగుదేశం నేతలు పిలుపునిచ్చారు. ఈనెల 26వ తేదీన ఇందిరాపార్కు వద్ధ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన గోడ పత్రికను శనివారం ఆవిష్కరించారు. నగర నేతలు పీ.సాయిబాబా, నల్లెల్ల కిషోర్, శ్రీపతి, సతీష్, బిల్డర్ ప్రవీణ్, ముప్పిడి మధుకర్‌లు మాట్లాడుతూ ఈనెల 26న నిర్వహించనున్న ధర్నాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ గౌడ్‌తో పాటు నర్సిరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీ.బాలరాజ్ గౌడ్, పెద్దోజు రవీంద్రాచారి, పీ.అశోక్, సూర్యదేవర లత, కుమారి ఇందిర, ఆర్.్భస్కర్, భానుప్రకాశ్ పాల్గొన్నారు.
ఎలా బలోపేతం చేద్దాం
నగరంలోని తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగాన్ని బలోపేతం చేసేందుకు మహిళా నేతలు నడుం బిగించారు.
శనివారం సిటీ టీడీపీ ఆఫీసులో ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లా మహిళా విభాగం బలోపేతం, 26న ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న ధర్నాకు పార్టీ శ్రేణుల తరలింపు వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26వ తేదీన ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న ధర్నాకు అత్యధిక సంఖ్యలో మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి కుమారి ఇందిరా, నేతలు సూర్యదేవర లత, ఝాన్సీ, అనురాధ, లీలా, పద్మావతి కోరారు.