హైదరాబాద్

నీటి పొదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరవాసుల దాహర్తిని తీర్చేందుకు ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి కోట్లాది రూపాయలను వెచ్చించి తాగునీటిని తీసుకువస్తున్నామనే విషయాన్ని గుర్తించి, ఎవరూ కూడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ సూచించారు. నీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించి, తగిన చర్యలు చేపట్టడటంతో పాటు నీటి పొదుపుపై వారిలో అవగాహన పెంపొందించేందుకు గురువారం ఉదయం సికిందరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి మంచినీటి సరఫరా జరుగుతున్న సమయంలో పర్యటించారు. జలమండలి ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ నీటి విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకుని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంట్లో డబ్బులను మనం ఏ విధంగానైతే జాగ్రత్తగా దాచుకుని మనకు అవసరమున్నపుడల్లా వినియోగించుకుంటామో నీటిని కూడా అదే స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. మహానగరం అవసరాలకు తగిన విధంగా వంద కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా,గోదావరి నదుల నుంచి హైదరాబాద్ మహానగరానికి నీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తున్న నీటిని నగరవాసులు ఇంటి వద్ద వృథా చేయటంతో రోజుకి సుమారు 50 మిలియన్ గ్యాలన్ల నీరు రోడ్డు పాలవుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ నీటి విలువను తెలిపేందుకు వాక్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ నీటిని వృథా చేయరాదని, ఉద్దేశ్యపూర్వకంగా వృధా చేస్తే జరిమానాలు విధించే పరిస్థితులు వస్తాయని సూచించారు. వాక్‌లో జలమండలి సీజీఎం విజయ రావు, జీఎం రాజశేఖర్ పాల్గొన్నారు.