హైదరాబాద్

స్థారుూ సంఘంలో ఎనిమిది తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కార్యకలాపాల్లో, పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే స్థారుూ సంఘం గురువారం మరోసారి సమావేశమైంది. ఎనిమిది తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానాలిలా ఉన్నాయి.
* జీహెచ్‌ఎంసీలో మూడు సంవత్సరాల సీనియారిటీ కలిగి, అర్హులైన 13 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం
* గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మించిన 43 మోడల్ మార్కెట్లలోని షాపులను కేటాయించే లబ్ధిదారులకు ఇదివరకు ఆరు నెలల అద్దెలను సెక్యూరిటీ డిపాజిట్‌గా స్వీకరించాలని భావించినా, దాన్ని మూడు నెలలకు కుదిస్తూ అధికారులు సమర్పించిన ప్రతిపాదనకు అనుకూలంగా స్థారుూ సంఘం తీర్మానం
* ఆల్వీన్ సంస్థ నుంచి జీహెచ్‌ఎంసీకి కేటాయించిన జూనియర్ అసిస్టెంట్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని స్థారుూ సంఘం నిర్ణయం
* వెటర్నరీ విభాగంలో ఔట్‌సోర్స్ పద్ధతిన 29 మంది వెటర్నరీ ఆఫీసర్ల నియామకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాలని స్థారుూ సంఘం నిర్ణయం
* ఏడాది క్రితం అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లోని ఎన్‌టీపీసీ కాంపౌండ్ వాల్ కూలిన ఘటనలో మృతి చెందిన ఇద్దరి కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.2లక్షల చొప్పున, గాయపడిన ఒక్కో కుటుంబానికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు అనుకూలంగా తీర్మానం
* జీహెచ్‌ఎంసీ భూ సేకరణ విభాగంలో ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, ఇద్దరు రిటైర్డ్ సర్వేయర్లను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకోవాలనే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్
* రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ప్లాన్‌లు, స్కెచ్, భూసేకరణ ప్రతిపాదనలు రూపొందించేందుకు 20 మంది ఇంజనీర్లను ఔట్‌సోర్స్ పద్ధతిన టౌన్‌ప్లానింగ్ విభాగంలో నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయం.