హైదరాబాద్

నటుడు జీవీ నారాయణ రావుకు పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ఆదర్శ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ నటుడు జీవీ నారాయణ రావుకు ‘నట ప్రవీణ’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ స్పీకర్ మధుసూదన రావు పాల్గొని నారాయణ రావుకు పురస్కారం ప్రదానం చేశారు. నారాయణ అనేక చిత్రలలో నటించి ప్రేక్షకులను మెపించారని పేర్కొన్నారు. గతంలో కుటుంబ కథ చిత్రలను నిర్మించే వారని ఇప్పుడు పూర్తిగా భిన్నంగా నిర్మాతలు చిత్రలను నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రముఖ గాయకుడు భోగరాజు నిర్వహణలో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ పేరిట సినీ సంగీత విభావరి నిర్వహించారు. యువ కళావాహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వర రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సామాజిక వేత్త డా.కొత్తకృష్ణవేణి, జీవీ ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ చైర్మెన్ గుదిబండి వెంకట రెడ్డి, గోవర్థన్, చిట్టిబాబు పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, ఆగస్టు 22: మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘మెగాస్టార్ సంగీత విభావరి’ గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి డబ్బింగ్ అర్టిస్ట్ ఆర్‌సీఎం రాజు, ఉదరి గోపాల్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సామాజిక వేత్త రేగొండ నరేష్ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయకుడు మధుబాపు శాస్ర్తీ నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి.
జగన్నాథ శర్మకు
సాహితీ పురస్కారం ప్రదానం
కాచిగూడ, ఆగస్టు 22: సీనియర్ జర్నలిస్టు నవ్య వారపత్రిక సంపాదకుడు ఎఎస్ జగన్నాథ శర్మకు ప్రముఖ సాహితీవేత్త రాయసం సుబ్బారాయుడు స్మారక సాహితీ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. ఆచార్య బోతవోలు రామబ్రహ్మం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ డా.పీ.రఘు, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, రచయిత రాయసం వెంకట్రామయ్య, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఆర్.ప్రభాకర రావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.
బహుజన సిద్ధాంతకర్త బీఎస్ రాములు
కాచిగూడ, ఆగస్టు 22: సమాజంలో అట్టడుగువర్గాల అభ్యున్నతి, అభివృద్ధికి తన రచనలతో చైతన్యాన్ని రగిలించిన సాహితీ శిఖరం బహుజన సిద్దాంతకర్త బీఎస్ రాములు అని వక్తలు కొనియాడారు. బీసీ కమీషన్ చైర్మెన్ బీఎస్ రాములు జన్మదిన సప్తతి వేడుకల్లో భాగంగా గురువారం రవీంద్రభారతిలో బీఎస్ రాములు రచనలపై ‘సాహిత్య సమాలోచనం’ పేరిట జాతీయ సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు, ఆంజనేయ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొని బీఎస్ రాములు రచించిన ‘ఒక సృష్టికర్త, ఆత్మచింతన, ప్రేమంటే ఏమిటి’ పుస్తకాలను ఆవిష్కరించారు. దగాపడుతున్న సామాన్యుడి పక్షాన దళపతిగా బీఎస్ నిలబడి పోరు జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు. నేటి నిజం సంపాదకుడు బైసదేవదాసు, ఎంబీసీ జాతీయ అధ్యక్షుడు సంగెం సూర్యారావు, సంఘసేవకురాలు డా.కొత్తకృష్ణవేణి పాల్గొన్నారు.
‘రాజీవ నేత్రుడా..’ సీడీ ఆవిష్కరణ
కాచిగూడ, ఆగస్టు 22: ప్రముఖ సత్య గురుస్వామి రచించిన ‘రాజీవ నేత్రుడా..’ అయ్యప్ప స్వామి భక్తి మధుర గీతాల సీడీ ఆవిష్కరణ సభ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని సీడీని ఆవిష్కరించారు. అయ్యప్ప స్వామిని విశ్వసించేవారు స్వామి అనుగ్రహం పొందుతారని పేర్కొన్నారు. సత్య గురుస్వామి ఎంతో అద్భుతంగా గీతాలను అలపించారని కీర్తించారు. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గురుస్వామి వీ ఎస్‌పీ తెనే్నటి స్వామి, రాజు గురుస్వామి, వంశీ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.
వెంట్రిలోక్విజమ్‌కు ప్రత్యేక గుర్తింపు
కాచిగూడ, ఆగస్టు 22: వెంటిలోక్విజమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని ప్రముఖ సినీ దర్శకుడు ముప్పలనేని శివ అన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వెంట్రిలోక్విజమ్ ఫెస్ట్’ గురువారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముప్పలనేని శివ పాల్గొని కళాకారులను అభినందించారు. వెంట్రిలోక్విజమ్ కళను నేర్చుకోవాడం ఎంతో కష్టసాధ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అదరణ పొందుతుందని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించగా శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, ఠాకూర్ బాలాజీ సింగ్, లోహిత్ కుమార్, కళారత్న మల్లం రమేష్, సంస్థ అధ్యక్షుడు చంద్రముఖి చంద్రశేఖర్ పాల్గొన్నారు.